బుధవారం 30 సెప్టెంబర్ 2020
Yadadri - Aug 14, 2020 , 03:19:56

మన వ్యవసాయం ేశానికే ఆదర్శం

మన వ్యవసాయం ేశానికే ఆదర్శం

  • వలస పోయినోళ్లు తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటుండ్రు 
  • రైతు శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం 
  • కరోనా కాలంలో రైతులను ఆదుకున్న ఏకైక సీఎం కేసీఆర్‌ 
  • రైతులు పంట ధర నిర్ణయించే రోజులు దగ్గరలోనే. 
  • తిరుమలగిరి,శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌  కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి  

తిరుమలగిరి / శాలిగౌరారం : తెలంగాణ వ్యవసాయం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరి, శాలిగౌరారం  వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకమండళ్ల ప్రమాణ స్వీకారానికి ఆయన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్సే అన్నారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. ఈ కష్టకాలంలోనూ రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఎరువులు,  విత్తనాలు సకాలంలో అందించటమే కాకుండా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. ఈ భూమి మీదు సంతోషంగా ఉన్నది తెలంగాణ రైతాంగమే అని అన్నారు. రైతుల సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని, రాబోయే రోజుల్లో రైతులు పండించిన పంటలకు వారే ధర నిర్ణయించనున్నారని అన్నారు. రైతులను సంఘటితం చేయటానికి రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కెట్‌ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమం కోసం పని చేయాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ను గజమాలతో సన్మానించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ నకిరేకల్‌ మార్కెట్‌కు గుండెకాయలాంటి శాలిగౌరారం మండలాన్ని విభజించి నేడు నూతన వ్యవసాయ మార్కెట్‌గా ఆవిర్భవించిందన్నారు. నూతనంగా ఏర్పడిన  పాలకవర్గాలు రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. అనంతరం నూతన మార్కెట్‌ పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ దీపిక, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజిని, ఎంపీపీలు స్నేహలత, లక్ష్మమ్మ,   పీఏసీఎస్‌ చైర్మన్‌ తాళ్లూరి మురళి, పార్టీ మండల అధ్యక్షులు రఘునందన్‌రెడ్డి, ఐతగోని వెంకన్నగౌడ్‌, జిల్లా నాయకులు యుగేంధర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.


logo