ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Aug 05, 2020 , 22:41:13

ఘనంగా నిత్య కల్యాణం

ఘనంగా నిత్య కల్యాణం

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం నిత్యపూజల కోలాహలం నెలకొన్నది. వేకువజామునే 5:30 గంటలకు అర్చకులు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించారు. బాలాలయంలోని కవచమూర్తులకు ఆరాధనలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చనలు చేశారు. అనంతరం లక్ష్మీనరసింహుడిని మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, కల్యాణం, అలంకార సేవోత్సవాలను నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు జరిగాయి. మంటపంలో అష్టోత్తర పూజలు చేశారు. కొండపై ఉన్న శివాలయంలో శైవసంప్రదాయంగా నిత్యారాధనలు కనుల పండువగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన చేశారు. కొవిడ్‌-19 జాగ్రత్తలు తీసుకుంటూ నిత్య పూజలు జరిపించారు. ఆలయంలోకి ప్రవేశించే ముందే భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌తో పరీక్షించారు.భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.

  స్వామి వారికి రూ.1.10 లక్షల ఆదాయం  :  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం పలు సేవల ద్వారా రూ.1,10,825 ఆదాయం వచ్చినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. ప్రసాద విక్రయాలతో రూ.93,970, వాహన పూజల ద్వారా రూ.3,200, ప్రచారశాఖ ద్వారా రూ.825, కొబ్బరికాయల ద్వారా రూ.10,620, మినీబస్సు ద్వారా రూ.1240, ఇతర సేవలతో రూ.970 వచ్చినట్లు పేర్కొన్నారు.  

VIDEOS

logo