సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 23, 2020 , 00:28:15

పోలింగ్ ప్రక్రియ పరిశీలన

పోలింగ్ ప్రక్రియ పరిశీలన


మోత్కూరు : రిపోలింగ్ ఆస్కారం లేకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు.  బుధవారం మోత్కూరులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  విలేకరులతో మాట్లాడారు.  రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17 మున్సిపాలిటీలు, ఐదు నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్లకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే  డయల్ 100కు కాల్ చేయాలని కోరారు. ఆయన వెంట భువనగిరి ఏసీపీ బొట్టు కిష్టయ్య, సీఐలు ఏవీ రంగా, రాజు, ఎస్ సీహెచ్ హరి ప్రసాద్ ఉన్నారు.


పోలీస్ స్టేషన్ సందర్శన

మోత్కూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మొదటి సారిగా సందర్శించారు.బుధవారం  స్టేషన్ రికార్డులను పరిశీలించారు. పోలీసుల పనితీరు, స్టేషన్ నిర్వాహణ పై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఏసీపీ బొట్టు కిష్టయ్య, సీఐలు ఏవీ రంగా, రాజు, ఎస్ సిహెచ్ హరి ప్రసాద్ పాల్గొన్నారు.


డీసీపీ నారాయణరెడ్డి..

మోత్కూరు మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రక్రియను డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు. బుధవారం  మోత్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, పీఎస్ గాంధీనగర్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, బీసీ సంక్షేమ వసతి గృహం, కొండగడప, బుజిలాపురం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోలింగ్ సరళిని డీసీపీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు  అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలన్నారు. పోలింగ్ ముగిసిన తదుపరి బ్యాలెట్ బాక్స్ జాగ్రత్తగా స్ట్రాగ్ చేరవేయాలన్నారు. డీసీపీ వెంట ఏసీపీ బొట్టు కిష్టయ్య, సీఐ ఏవీ.రంగా, ఎస్సై హరిప్రసాద్ ఉన్నారు.


చౌటుప్పల్ 

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లిలోని పోలింగ్ కేంద్రాన్ని బుధవారం సీపీ మహేష్ పరిశీలించారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేస్తున్న విధానాన్ని ఓటర్లకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నదన్నారు. ఆయన వెంట డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. 


జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సిక్తా పట్నాయక్..

తంగడపల్లి, చౌటుప్పల్ పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పోలింగ్ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పీవోలకు వివరించారు. ఓటింగ్ ప్రశాంతంగా జరగడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ఆర్డీవో ఎస్.సూరజ్ , మున్సిపల్ కమిషనర్ రాందుర్గారెడ్డి ఉన్నారు. 


భువనగిరిలో.. 

భువనగిరి,నమస్తేతెలంగాణ/భువనగిరి అర్బన్: భువనగిరి మున్సిపల్ పరిధిలోని 35 వార్డులకు జరిగిన ఎన్నికలను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. బుధవారం 13వ వార్డులో కలెక్టర్ అనితారామచంద్రన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం పరిశీలించి పోలింగ్ సరళిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఐదో వార్డులో ఏసీపీ భుజంగరావు, 21వ వార్డులో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికిరణ్ పరిశీలించారు. 


భూదాన్ 

భూదాన్ భూదాన్ నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలను బుధవారం పలువురు అధికారులు పరిశీలించారు. పోచంపల్లి పట్టణంలోని బాలుర, బాలికల ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సిక్తా పట్నాయక్  పరిశీలించారు. పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక జాయింట్ కలెక్టర్ రమేశ్, డీసీపీ నారాయణరెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి.. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఇకపోతే నారాయణగిరిలోని పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్ పరిశీలించారు. 


VIDEOS

logo