హనుమకొండ, నవంబర్ 21: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం హనుమకొండ ఏనుగులగడ్డలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆర్గనైజర్, బీఆర్ఎస్ 8వ డివిజన్ అధ్యక్షుడు పులి విక్రమ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గందపెల్లి సాంబయ్య, బోయిన గణేష్, గందపల్లి రవి, చింతాకుల ప్రభాకర్, గోనెల సాగర్, గోనెల వీరప్రసాద్, గందపెల్లి రాజేష్, గోనెల సూరి, కక్కు పృథ్వీరాజ్, గోనెల రాజు, బాలబోయిన ప్రతాప్, సాదరబోయిన వేణు, అంజయ్య, గోనెల నాగరాజ్, బలబోయిన మురళి, మేకల సదానంద, మిట్టపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఐనవోలులో..
ఐనవోలు మండల వ్యాప్తంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్లు జెండాలను ఏగురావేశారు. మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం సొసైటి అధ్యక్షుడు కాటబోయిన సంపత్ (పండు) జెండాను ఎగురావేశాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజులను బీసీ- డీ నుంచి బీసీ-ఏకి మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చెన్నూరు రాజు, సంఘం సభ్యులు నారాయణ, ఉపేందర్, సమ్మయ్య, శ్రీను, కుమారస్వామి, ఆశోక్, రాజు, రవి, ఉప్పలయ్య, శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు.
