హనుమకొండ, మే 17 : మహిళా కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని తెలంగాణ పిండి వంటల కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పిండి వంటలు చేసే మహిళా కార్మికులు, నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు. సొంతగా వ్యాపారం చేసుకునే వెసలుబాటు కల్పిస్తామన్నారు. 45 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. అలాగే మహిళా కార్మికుల ఆర్థిక స్థితిగతులు, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పిండి వంటల పేరుతో తెలంగాణ సంస్కృతి, ఆచారా లు, ఆహారపు అలవాట్లను కాపాడుతున్న యా జమాన్యం, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక, ఉద్యోగ సంక్షే మ మాసోత్సవ కో ఆర్డినేటర్ పుల్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్‌రావు, వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అండగా ఉంటా..
నయీంనగర్ : విద్యార్థులకు అండగా ఉం టానని చీఫ్‌విప్ దాస్యం అన్నారు. హనుమకొం డ వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి కళాశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. ఎం డ తీవ్రత పెరిగిన నేపథ్యంలో కళాశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా తన వంతుగా ఒక పూట భోజనం ఏర్పా టు చేయిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం కళాశాలకు జిజ్ఞాస ప్రాజెక్టుల్లో రాష్ర్ట స్థాయిలో రెండు ప్రథమ బహుమతులు రావ డం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ రామకృష్ణారెడ్డి , రేణుక, పార్వతి, శిరీష పాల్గొన్నారు.