మహదేవపూర్, డిసెంబర్ 28 : మహిళా చైతన్యంతోనే మార్పు సాధ్యమని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని గడి (వారసంత)లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి ఉత్సావాల్లో భాగం గా మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పుట్ట శైలజ హాజరై సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ చదువు విలువ తెలుసుకుంటేనే చరిత్ర సృష్టించగలమన్నారు. మన బతుకులు బాగుపడాలనే ఆలోచనతో సావిత్రీబాయి మహిళలకు అక్షరాలు నేర్పిందన్నారు. తాము కూడా వారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉం టూ పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ బన్సోడ రాణీబాయి, బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు ఓడేటి స్వప్నామల్లారెడ్డి, మంథని నియోజకవర్గ మహి ళా ఇన్చార్జి కేదారి గీత, తగరం శంకర్‌లాల్, పార్టీ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీలు జయశ్రీ,చల్ల రమణ, సర్పంచ్ శ్రీపతిబాపు, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ సల్మాన్‌ఖాన్, యూత్ అధ్యక్షుడు ఆలీంఖాన్ పాల్గొన్నారు.