ములుగు రూరల్, జూన్ 26 : జ్వరంతో వివాహిత మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం రాయినిగూడెంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి బం ధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మడిపోజు స్ర వంతి (20) భర్త బాలుతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న ది.
ఈ నెల 24న అత్తగారిల్లు అయిన రాయినిగూడేనికి వచ్చింది. అదే రోజు ఆమెకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ములుగులోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలుపడంతో హనుమకొండలోని మరో ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.