డోర్నకల్, ఆగస్టు4: ఓ సైబర్ నేరగాడు వాట్సాప్ డీపీలో పోలీసు ఫొటో పెట్టుకొని ఒకరికి వల విసిరాడు. వివరాలిలా ఉన్నాయి.. డోర్నకల్‌కు చెందిన ఖాదర్బాబాకు ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి తాను సీబీఐ నుంచి మాట్లాడుతున్నానని,
మీ కొడుకు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడని, రూ. 30 వేలు ఫోన్ పే లేదా గూగూల్ పే చేస్తే కేసు కాకుండా చూస్తానని తెలిపాడు. ఖాదర్‌బాబా ఏ పోలీసు స్టేషన్ అని అడగగా రూ. 30 వేలు పంపిస్తే వివరాలు చెబుతానని చెప్పాడు. తన కొడుకు ఇంట్లోనే ఉండడంతో సైబర్ నేరగాడి మోసం గ్రహించిన ఖాదర్‌బాబా ఫోన్ పెట్టేశాడు.