MGM Hospital | వరంగల్ చౌరస్తా: ఎంజీఎం హాస్పిటల్ సేవలు మరింత మెరుగు పరచడం కోసం తమ వంతు సహకారం అందించడానికి కృషి చేస్తామని జన ప్రియ ఫౌండేషన్ చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. జన ప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్బులిటీ ఫండ్స్ ద్వారా రూ.60 లక్షల నిధులతో అందించిన 41 యంత్ర పరికరాలను ఎంజీఎం హాస్పిటల్ కి అందజేసి, ఆయన ప్రారంభించారు.
ఎంజీఎం హాస్పిటల్ కి గతంలో శాతం యంత్ర పరికరాలను అందజేయడం జరిగిందని, భవిష్యత్తులో సైతం మరింత సహకారం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బులియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ప్రతినిధి సుధా జిజారియా, జన ప్రియ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.