గిర్మాజీపేట, నవంబర్ 3 : గతంలో మ్యానిఫెస్టోలో లేనటువంటి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలను పేదలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మేయర్ గుండు సుధారాణితో కలిసి 29వ డివిజన్ రామన్నపేట బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసి మ్యానిఫెస్టో కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 5 వేల కోట్లతో పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఇప్పటికే నగరాన్ని ఎడ్యుకేషనల్, టూరిజం హబ్, కల్చరల్, ఐటీ హబ్‌గా మార్చామన్నారు. ప్రతిపక్షాల నాయకులు పసలేని విమర్శలు చేస్తూ, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని, వారిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. అనంతరం మేయర్ సమక్షంలో మహమ్మద్ షఫీ ఆధ్వర్యంలో 150 మందికి దాస్యం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్‌గౌడ్, డివిజన్ ఇన్చార్జి నార్లగిరి రమేశ్, 29వ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రసాద్, తాళ్లపల్లి రమేశ్, రాచర్ల రాము, వాడుక నాగరాజు, గట్టు చంద్రు, కొప్పు సతీశ్, ఎస్కే రహమాన్‌పాషా, రుద్ర శ్రీనివాస్, పూజారి కుమారస్వామి, మామునూరి రాజు, మాల్వే రాజు, ఎండీ తహసీనా, నక్క జ్యోతి, ప్రశాంత్, కరుణాకర్, అరుణ్, ఆనంద్, రాజ్‌కుమార్, వరుణ్, శివ, ఎలీషా, అడుప విజయ్, స్వప్న, వనిత, సరిత పాల్గొన్నారు.
వరంగల్ : సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని దాస్యం అన్నారు. 11వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాజీవ్ కాలనీ, ముదిరాజ్ వీధిలో తిరుగుతూ కరపత్రాలను పంచారు. ఆపదలో ప్రజలకు అందుబాటులో ఉండి ఆదుకుంటున్నామన్నారు. కుమ్మరి సదానందం ఆధ్వర్యంలో డివిజన్లోని పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ 11వ డివిజన్ నాయకులు మాలకుమ్మరి పరశురాములు, బైరపాక ప్రశాంత్, గన్నారపు కమల్, అయేషా, దీపు, ఫాతిమా, విద్య, నాగరాజు, సుకుమార్, వాసు, దేవి పాల్గొన్నారు.
హనుమకొండ : మైనారిటీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, తెలంగాణ అభివృద్ధి ఆగొద్దంటే పార్టీకి అండగా నిలువాలని చీఫ్ విప్ విజ్ఞప్తి చేశారు. అదాలత్, చోటీ మసీద్, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, మసీద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో తనకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు మైనారిటీల పూర్తి మద్దతు ఉందన్నారు. కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్‌రావు పాల్గొన్నారు.