హనుమకొండ చౌరస్తా, మే 20 : తెలంగాణ రాష్ట్రస్థాయి నెట్‌బాల్ అండర్-16లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాల్గొన్న క్రీడాకారులు తమ ప్రతిభను చాటి బ్రాంజ్ మెడల్‌ను కైవసం చేసుకున్నారు. 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో తలపడి జిల్లాకి తృతీయ బహుమతి తీసుకువచ్చినట్లు నెట్ బాల్ అధ్యక్షుడు కందుల సృజన్కాంత్ తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారులకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజిజన్, జిల్లా క్రీడాధికారి గుగులోతు అశోక్ కుమార్ నాయక్, అధ్యక్షుడు కందుల సృజన్కాంత్, సెక్రటరీ సూర్యారావు, రాష్ట్ర సెక్రటరీ లిల్లీ ఫ్లోరెన్స్, హాకీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకరి పరమేశ్వర్, అల్తాఫ్, కోచ్ కార్తీక్ సింగ్ కూర్ని, క్రీడా కారులను అభినందించారు.