నర్సంపేట రూరల్, డిసెంబర్ 23: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణల పితామహుడు అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పీవీ జన్మస్థలమైన లక్నేపల్లిలో గురువారం ఆయన 17వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ కాంస్య విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పీవీ కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పీవీ మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి దేశానికి ప్రధాని కావడం గర్వకారణమన్నారు. పీవీ జ్ఞాపకార్థం మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పీవీకి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అరుదైన గౌరవాన్ని కల్పిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో తాసిల్దార్ వాసం రామ్మూర్తి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గురిజాల జడ్పీఎస్‌ఎస్‌లో రూ. 48 లక్షల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్కారు బడుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, ఈఈ దేవిదాస్, డీఈ రవీందర్, ఏఈ అశోక్‌కుమార్, సర్పంచ్ మమత, ఎంపీటీసీ శ్రీలత, పీఏసీఎస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష. ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, నర్సింహరాములు, ఉప సర్పంచ్ హరీశ్, హెచ్ఎం రాంచందర్‌రావు, ఎస్ఎంసీ చైర్మన్ రాములు తదితరులు పాల్గొన్నారు.
105 మందికి చెక్కుల పంపిణీ
నర్సంపేట: పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో డివిజన్లోని 105 మందికి రూ. 37.85 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నదన్నారు. ప్రతినెలా నర్సంపేట నియోజకవర్గం నుంచి 400 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఆర్బీఎస్ కన్వీనర్లు పాల్గొన్నారు.
గిర్నిబావిలో అన్నదాతలకు సన్మానం
దుగ్గొండి: రైతుల సౌకర్యార్థం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న రైతు ఉత్పత్తి కేంద్రాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. గిర్నిబావిలో రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయశంకర్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఫర్టిలైజర్, సీడ్స్ కంపెనీ లిమిటెడ్ షాపును ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుని ఆదర్శ రైతులను సన్మానించారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్‌రావు, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, రమాదేవి-విజేందర్‌రెడ్డి, పిండి కుమారస్వామి, కమలాకర్ జోగ్య, సంఘం నిర్వాహకుడు పుచ్చకాయల కృష్ణ్ణరెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పెద్ది జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్‌తో కలిసి లక్ష్మీపురంలోని చర్చిలో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. సర్పంచ్ పాండవుల సురేందర్, ఎంపీటీసీ సుమన్, తాసిల్దార్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.
రేఖంపల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ
దుగ్గొండి: ఛత్రపతి శివాజీ సమాజానికి ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రేఖంపల్లిలోని కూడలిలో దాతల సహకారంతో ఆరె సంక్షేమ సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆరె సంఘం నాయకులతో కలిసి పెద్ది ఆవిష్కరించారు. బంగారుతెలంగాణ నిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పెద్ది తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డి, ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోర్తాల చందర్రావు, నాయకులు సోమిడి అంజన్‌రావు, జెండా రాజేశ్, రంగారావు, రమేశ్, యుగేంధర్‌రావు, సర్పంచ్ యుగేంధర్, ఎంపీటీసీ సోనీరతన్ తదితరులు పాల్గొన్నారు.
సర్వమతాలకు సమప్రాధాన్యం
చెన్నారావుపేట: తెలంగాణ ప్రభుత్వం సర్వమతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కోనాపురంలోని జేడీఎం బాప్టిస్ట్ చర్చిలో పెద్ది కేక్‌కట్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బదావత్ విజేందర్, తాసిల్దార్ ఫూల్సింగ్చౌహాన్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, మండ ల కో ఆప్షన్ సభ్యుడు ఎంఏ గఫ్ఫార్, సర్పంచ్ వెల్దె సుజాతాసారంగం, ఎంపీటీసీ గుండాల మహేందర్, ఉపసర్పంచ్ నర్సింహరాములు, ఆర్ఎస్ఎస్ గ్రామ కన్వీనర్ రాజేందర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కాల్నాయక్తండా, ఖాదర్‌పేట, 16 చింతల్‌తండా సర్పంచ్‌లు రజితావీరన్న, కుమారస్వామి, శారదాగణేశ్ పాల్గొన్నారు.