నర్సంపేట రూరల్, నవంబర్ 25: రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అన్నదాతల సౌకర్యార్థం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఎంపీపీ మోతె కళావతి, నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి సూచించారు. మండలంలోని మహేశ్వరం, లక్నేపల్లి, సర్వాపురం, ద్వారకపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, పీఏసీఎస్ చైర్మన్లు శుక్రవారం వేర్వేరుగా ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2,060, సీ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2,040 చెల్లిస్తున్నదని తెలిపారు. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, సర్పంచ్‌లు మాడ్గుల కవిత, గొడిశాల రాంబాబుగౌడ్, ఏఈవో మెండు అశోక్, మండల భరత్, నవీన్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం కుందేళ్ల మహేందర్, వైస్ చైర్మన్ మేర్గు శ్రీనివాస్, డైరెక్టర్లు దామెర రవీందర్, పాలాయి రాము, దొంగల వెంకటమ్మ, గుగులోత్ లక్ష్మణ్, బైరి జనార్దన్‌రెడ్డి, బొబ్బాల రమణారెడ్డి, గుజ్జుల మాధవరెడ్డి, పెసరు సాంబరాజ్యం, మిట్టగడపల సుప్రజ, కోమాండ్ల రాజిరెడ్డి, దర్గూరి తిరుపతి, సీఈవో జక్కుల మధు పాల్గొన్నారు.
ప్రైవేట్ వ్యక్తులకు వడ్లు అమ్మొద్దు
చెన్నారావుపేట: ప్రైవేట్ వ్యక్తులకు వడ్లు అమ్మొద్దని ఎంపీపీ విజేందర్, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి రైతులకు సూచించారు. చెన్నారావుపేట మండలం అమీనాబాద్, తిమ్మారాయిన్పహాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మురహరి రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సిద్దన రమేశ్, ఎంపీటీసీ కడారి సునీతా సాయిలు, స్వామి, వైస్ చైర్మన్ పెండ్లి మల్లయ్య, ఉప సర్పంచ్ ఊరుగొండ లింగస్వామి, సంఘం సీఈవో రఘుపతి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
నల్లబెల్లి మండలంలో నేటి నుంచి షురూ..
నల్లబెల్లి: మండలంలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు ఏవో పరమేశ్వర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీఏసీఎస్ ఆధ్వర్యంలో నందిగామ, నల్లబెల్లి, ముచ్చింపుల, అర్శనపెల్లి, కన్నారావుపేట, గోవిందాపూర్, నాగరాజుపల్లె, గుండ్లపహాడ్, మేడెపల్లిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఐకేపీ ఆధ్వర్యంలో రాంపూర్, మామిండ్లవీరయ్యపల్లె, నారక్కపేటలో ఏర్పాటు చేస్తామన్నారు. మేడెపల్లిలో గతేడాది ఎఫ్‌పీవో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ప్రస్తుతం ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని తెలిపారు. శనివారం నుంచి ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నామని చెప్పారు. సోమవారం నుంచి పీఏసీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.