కురవి, అక్టోబర్ 31 : కురవి మండల కేంద్రంలోని ఈఎంఆర్ఎస్ (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్) రాష్ట్ర స్థాయి క్రీడా, ఎంపిక పోటీలకు సన్నద్ధమైంది. నేటి నుంచి నాలుగురోజులపాటు జరిగే స్టేట్ మీట్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల గురుకుల ఆర్సీవో రాజ్యలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1300 మంది క్రీడాకారులు పాల్గొనే క్రీడల్లో ఎలాంటి పొరపాట్లు జరుగొద్దని అధికారులను ఆదేశించారు. ఫుడ్ సెక్షన్, క్రీడాకారులు, కోచ్‌లు ఉండేందుకు వసతిని పర్యవేక్షించారు. ఈఎంఆర్ఎస్ సొసైటీ ఏర్పడిన తర్వాత జరిగే మొదటి స్టేట్ మీట్ ఇదని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఇన్చార్జి ఆర్సీవో డీఎస్ వెంకన్న, స్టేట్ స్పోర్ట్స్ అధికారి రమేశ్‌కుమార్, తహసీల్దార్ ఇమ్మాన్యుయేల్, ఎంపీడీవో సరస్వతి, ప్రిన్సిపాల్ వీ సరిత, పీడీ వీర్యానాయక్, వైస్ ప్రిన్సిపాల్ భరణి, వ్యాయామ ఉపాధ్యాయులు కిషన్, విజయ, స్వాతి, బాబురావు, జ్యోతి, ప్రసాద్, గణేశ్‌యాదవ్, శంకర్, చాంప్లా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.