కేసీఆర్‌తోనే మహిళలకు గౌరవం
ప్రసవం.. మహిళలకు మరో జన్మలాంటిది. అలాంటి సమయంలో ఉచిత వైద్యంతో పాటు పుట్టిన బిడ్డకు అవసరమైన వస్తువులతో ‘కేసీఆర్ కిట్’ ఇవ్వడం గొప్ప విషయం. ప్రతి కుటుంబాన్ని తన కుటుంబంగా, ప్రతి ఆడపడుచుని తన కూతురిలా ఆదరించే సీఎం దేశ రాజకీయాల్లో వస్తే మనకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా రక్షణ, ఆర్థికాభివృద్ధికి రుణాలు, భద్రతకు షీ టీమ్‌లు, పురుషులతో సమానంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఇక్కడి పథకాలు దేశంలోని మహిళలందరికీ అందాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. ఇందుకు మహిళలంతా మద్దతునివ్వాలి.
– కందగట్ల స్వరూప, ఎల్బీ నగర్, వరంగల్
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 2:పేద, ధనిక తేడా లేకుండా అందరినీ అక్కున చేర్చుకోవడమే కాదు.. ముఖ్యంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్‌తోనే దేశంలోని మహిళలందరికీ భద్రత, భరోసా కలుగుతుందని ‘కేసీఆర్ కిట్’ లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు. ‘తోడబుట్టిన అన్నలా ‘ఆసరా’ అవుతూ.. మేనమామలా పెండ్లికి కట్నం కింద ‘కల్యాణలక్ష్మి’ ఇచ్చి అండగా నిలువడంతో పాటు సర్కారు దవాఖానలో పురుడు పోసుకున్న గర్భిణులకు ‘కేసీఆర్ కిట్’.. భద్రత కోసం షీటీమ్‌లు, ఆర్థికాభివృద్ధి కోసం వడ్డీలేని రుణాలు అందిస్తూ మా ఆడబిడ్డలకు అన్ని విధాలా అండగా ఉంటున్నారని.. ఇలాంటి నాయకుడే ఇప్పుడు దేశానికి అవసరమని.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి గొప్ప మార్పు తీసుకురావాలంటూ నిండు మనస్సుతో ఆశీర్వదించారు.
కేసీఆర్ కిట్ సూపర్
మాలాంటి పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆరే దిక్కు. సర్కారు దవాఖానలో నాకు కాన్పు జరిగి ఐదు రోజులవుతున్నది. బాబు పుట్టాడు. దవాఖానలో ఇచ్చిన కేసీఆర్ కిట్ సూపర్. అందులో పసిబిడ్డకు, నాకు అవసరమైన సబ్బులు, పౌడర్లు, డ్రెస్‌లు, టవల్స్, చీరలు ఉన్నాయి. దవాఖానకు ఎంత సంతోషంగా వెళ్లానో.., అంతే సంతోషంగా ఇంటికి వచ్చాను. ఇంతకంటే ఏం కావాలి. పేదలంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువ. పెళ్లి సమయంలో కల్యాణలక్ష్మి, పురుడు సమయంలో కేసీఆర్ కిట్, డబ్బులు ఇస్తుండు. ఇంత గొప్ప నాయకుడు దేశ రాజకీయాల్లోకి వస్తే మాలాంటి పేదలకు ఇంకింత మంచి జరుగుతుంది. కేసీఆర్ సార్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
– రజినీకౌర్, అంబేద్కర్‌నగర్, జనగామ
ఆడబిడ్డల విలువ తెలిసినోడు
ఆడబిడ్డల విలువ తెలిసినోడు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తండ్రిలా చూసుకుంటున్నడు. సర్కారు దవాఖానలో పురుడు పోసుకున్న నాకు కేసీఆర్ కిట్టు, ఆరు నెలలపాటు నెలకు రూ.2వేల చొప్పు రూ.12వేలు అందించారు. ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను అమ్మఒడి వాహనం క్షేమంగా ఇంటికి తీసుకొచ్చింది. కేసీఆర్ కిట్ అయితే అద్భుతం. బాలింతకు, పుట్టిన బిడ్డకు అవసరమైన అన్ని వస్తువులు అందులో ఉన్నాయి. అంతేకాకుండా అనేక పథకాలు అమలు చేస్తూ మహిళలకు అండగా ఉంటున్నరు. కల్యాణలక్ష్మి, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, రక్షణకు షీటీమ్‌లు ఏర్పాటు చేశారు. మన కల్యాణలక్ష్మి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపీ కొట్టింది. కల్యాణమస్తుగా పేరు మార్చి అమలు చేస్తున్నది. ఇలాంటి పథకాలు దేశంలోని మహిళలందరికీ అందాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే. ప్రధానికి కావాల్సిందే.
– గడ్డం సౌజన్య, కల్వల
ఇక్కడి పథకాలు దేశమంతా అమలవుతాయి..
ఏటూరునాగారం, అక్టోబర్ 2 : ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అద్భుతం. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. తల్లీబిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చారు. బాలింతలు, పసిపిల్లలకు అవసరమయ్యే వస్తువులు ఇందులో చాలా ఉన్నాయి. సబ్బులు, పౌడర్లు, డ్రెస్‌లు, టవల్స్, చీరలు ఉన్నాయి. వీటిని బయట కొంటే వేలల్లో ఖర్చువుతుంది. కేసీఆర్ కిట్ మన రాష్ర్టానికే పరిమితం కాకుండా దేశమంతా అమలు చేయాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం కరెక్టే. అందరం ఆయనకు అండగా ఉండాలి.
– దుర్గం మధురవాణి, తిమ్మంపేట, మంగపేట మండలం
మహిళా లోకం కేసీఆర్ వెంటే
సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశ మహిళలందరికీ భరోసా ఉంటుంది. ఇక్కడ అమలవుతున్న పథకాలతో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నరు. కల్యాణలక్ష్మి, అమ్మఒడి సేవలు, కేసీఆర్ కిట్, వడ్డీలేని రుణాలు, షీ టీమ్‌లు.. ఇలాంటివి మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేవు. దేశంలోని మహిళలందరికీ మనలాంటి సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. యావత్ మహిళా లోకమంతా కేసీఆర్ వెంటే ఉండాలి.
– పోడెట్టి పూజ, రేగొండ
కేసీఆర్ నాయకత్వాన్ని దేశమంతా కోరుకుంటోంది
మహిళలంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ, గౌరవం. ఆయన నాయకత్వం కోసం దేశంలోని మహిళలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను అన్ని రాష్ర్టాల ఆడబిడ్డలు కోరుకుంటున్నరు. ముఖ్యంగా ప్రసూతి సమయంలో ఇబ్బందిపడకుండా ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా తీర్చిదిద్దారు. ఇప్పుడు గర్భిణులు వైద్యం సహా డెలివరీ కోసం సర్కారు దవాఖానకు రావడానికే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు దవాఖానలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి మార్పు దేశంలో చూడాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి. ఆయనకు మనమందరం అండగా ఉండాలి. నేను జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో పురుడు పోసుకున్నా. నార్మల్ డెలివరీ చేశారు. బాబు పుట్టాడు. స్థానిక ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ప్రభుత్వ దవాఖానలో అందుతున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. కేసీఆర్ కిట్టు ఓ అద్భుతం. తల్లీబిడ్డలకు కావాల్సిన అన్ని వస్తువులు అందులో ఉన్నాయి.
– మాచర్ల లక్ష్మి, కోలుకొండ, దేవరుప్పుల మండలం