చెన్నారావుపేట, నవంబర్ 22 : గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పాత సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, ఏఈవో స్మిత, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, సొసైటీ వైస్‌చైర్మన్ చింతకింది వంశీ, సీఈవో చిట్టె రవి, సొసైటీ డైరెక్టర్లు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లాయగూడెంసర్పంచ్ మంద జయ, ఉప సర్పంచ్ కందికొండ విజయ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ మంచాల సరిత, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎదురబోయిన సాంబయ్య, కందకట్ల రాజారాం, అబ్బనాపురం చారి, పానుగంటి కొంరయ్య, మంచోజు వెంకన్న, టేకుల స్వామి, మంద రవికుమార్ పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం, నవంబర్ 22 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాపులకనపర్తి సొసైటీలో కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. ఏ గ్రేడ్ రూ. 1960, సీ గ్రేడ్ రూ.1940 చెల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దొమ్మాటి సంపత్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నరహరి, గ్రెయిన్ మార్కెట్ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, సర్పంచ్‌లు కిశోర్‌యాదవ్, పులుగు సాగర్‌రెడ్డి, ఎంపీటీసీలు సుతారి బాలకృష్ణ, పద్మ, తహసీల్దార్ నరేంద్రనాథ్, ఏవో యాకయ్య, సొసైటీ డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ వాసం సాంబయ్య, గోవర్దన్‌గౌడ్, జనగాం శ్రీనివాస్ పాల్గొన్నారు.
పర్వతగిరిలో..
పర్వతగిరి, నవంబర్ 22 : మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో సర్పంచ్ గటిక సుష్మ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కేంద్రాలకే ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మౌనిక రాజు, సుభాషిణి, ఉపసర్పంచ్ దేవేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సన్నూరులో కొనుగోలు కేంద్రం ప్రారంభం
రాయపర్తి, నవంబర్ 22 : మండలంలోని సన్నూరు గ్రామంలో ఇందిరాక్రాంతి పథం-మహిళా సంఘాల సంయుక్త నిర్వాహణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసిన కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నలమాస సారయ్య, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, ఎంపీటీసీ భూక్యా గోవింద్‌నాయక్, రైతులు పాల్గొన్నారు.
ఖానాపురంలో..
ఖానాపురం,నవంబర్ 22 : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని చెన్నారావుపేట సొసైటీ చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి అన్నారు. చెన్నారావుపేట సొసైటీ ఆధ్వర్యంలో రాగంపేట, రంగాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను చైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో రైతులు, సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
కొనుగోళ్లను వేగవంతం చేయాలి : సీపీఐ
వర్ధన్నపేట, నవంబర్ 22 : ధాన్యం కొనుగోళ్లను అధికారులు వేగవంతం చేయాలని సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి పంజాల రమేశ్ కోరారు. మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎదురవుతాయని గుర్తించి కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను రద్దు చేసిందని అన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరెల్లి రవి, సహాయ కార్యదర్శి యాదగిరి, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.