దుగ్గొండి, జూన్ 16: గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పూర్తి చేయాలని డీపీవో నాగపూరి స్వరూపారాణి సూచించారు. మండలంలోని నాచినపల్లిలో గురువారం ఆమె పల్లె ప్రగతి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తొలుత డీపీవోకు సర్పంచ్ దంపతులతోపాటు జీపీ వార్డు సభ్యులు, సిబ్బంది మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె గ్రామంలోని విలేజ్ పార్కు, డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, నర్సరీని పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీకి చేరుకొని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్వరూపారాణి మాట్లాడుతూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు నిత్యం పారిశుధ్య పనులు చేయాలని సూచించారు. దోమల నివారణకు పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. నాచినపల్లిలో పల్లె ప్రగతి పనులు బాగున్నాయని కితాబిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ పెండ్యాల మమతారాజు, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, ఉపసర్పంచ్ జంగ రాజిరెడ్డి, కార్యదర్శి ముక్కెర ఆనంద్, వార్డు సభ్యులు అచ్చిరెడ్డి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
నల్లబెల్లి: ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయని డీఎల్పీవో వెంకటేశ్వర్లు అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నల్లబెల్లి మండలకేంద్రంలోని డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక, పల్లెప్రకృతి వనంతోపాటు పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అన్ని వర్గాల ప్రజలను మమేకం చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి, ఫాగింగ్, క్లోరినేషన్ పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీవో కూచన ప్రకాశ్, గ్రామ ప్రత్యేక అధికారి అబీదలీ, సర్పంచ్ నానెబోయిన రాజారాం, కార్యదర్శి ధర్మేందర్ పాల్గొన్నారు.
‘పల్లె ప్రగతి’ని విజయవంతం చేయాలి
పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని నర్సంపేట ఎంపీపీ మోతె కళావతి, నర్సంపేట జడ్పీటీసీ కోమాండ్ల జయ అన్నారు. గురువారం వారు మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను సర్పంచ్‌లు, కార్యదర్శులతో కలిసి వారు పరిశీలించారు. కమ్మపల్లి, నాగుర్లపల్లి, లక్నేపల్లి, రామవరం, ముగ్దుంపురంలో పనులను ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వల్గుబెల్లి రంగారెడ్డి, కందికొండ రజిత, గొడిశాల రాంబాబు, కొడారి రవన్న, పెండ్యాల జ్యోతి, ప్రత్యేకాధికారులు సుధాకర్, ప్రియాంక, భాస్కర్, నవీన్, ఫాతిమామేరి పాల్గొన్నారు. గీసుగొండ మండలం మరియపురంలో సర్పంచ్ అల్లం బాలిరెడ్డి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. కార్యదర్శి స్వప్న, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలం చెరువుకొమ్ముతండా పరిధిలో సర్పంచ్ దేశిరాం, కార్యదర్శి రమాదేవితో కలిసి జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మొక్కలు నాటారు. అనంతరం డంపింగ్ యార్డును సందర్శించారు.
వర్మీకంపోస్టును ఎక్కువ మొత్తంలో తయారు చేయాలని జీపీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ నీలమ్మ, తండావాసులు రమేశ్, బాబు, సుబ్బన్న, కిషన్, దీప్లా, శంకర్, వీరన్న పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేటతండా, పాపయ్యపేటలో రోడ్లను శుభ్రం చేసి పిచ్చిమొక్కలను తొలగించారు. సూర్యపేటతండాలో కార్యదర్శి భరత్ డ్రైనేజీలను చేయించారు. విలేజ్పార్కులో కలుపు మొక్కలను తీయించారు. ప్రత్యేక అధికారి కట్టయ్య పాల్గొన్నారు. లింగగిరి, కోనాపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఏపీఎం ముక్కెర ఈశ్వర్ పాల్గొని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమన్నారు. కోనాపురంలో సర్పంచ్ వెల్ది సుజాత, లింగగిరిలో సర్పంచ్ మాదారపు భాస్కర్ మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. రెండు గ్రామాల్లో శ్రమదాన కార్యక్రమాలతోపాటు గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రతినబూనారు. కార్యదర్శులు రాజు, అశోక్, సీసీలు వెంకటేశ్వర్లు, మంజుల, వీవోఏలు రమేశ్, లత, సభ్యులు పాల్గొన్నారు.