వరంగల్‌చౌరస్తా/ఖిలావరంగల్, జూన్ 10: వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేటలో పట్టణ ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సమస్యలను గుర్తిస్తున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. మిగతా వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 8వ రోజు కార్యక్రమంలో పారిశుధ్య పనులు చేశారు. వరంగల్ 36వ డివిజన్ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ పాల్గొన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు. అలాగే, డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మసూద్, పట్టణ ప్రగతి అధికారి రాజునాయక్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 38వ డివిజన్ ఖిలావరంగల్ మధ్యకోటలో మిషన్ భగీరథ పైపులైన్లు, డ్రైనేజీలు, విద్యుత్ సమస్యలపై కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్‌యాదవ్, నోడల్ ఆఫీసర్ నరేందర్, ఇన్చార్జి శేఖర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు తోటకూరి నర్సయ్య, జూలూరి శ్రవణ్, నాయకులు కాసుల ప్రతాప్, రావుల రాజేశ్, ముప్ప మధు, బొల్లం కార్తీక్, అనుమాస్ సత్యం, బండి శోభ, మిట్టపెల్లి కృష్ణవేణి, పిట్టా రమాదేవి, బండి కవిత, పోశాల అరుణ, పొన్నం శ్రీలత, బైరబోయిన మంజుల, గద్దల దయాకర్ పాల్గొన్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
కాలనీల్లో గుర్తిస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కార్పొరేటర్లు అధికారులకు సూచించారు. 32, 39, 40, 41, 42వ డివిజన్లో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన కలిసి 25వ డివిజన్లోని ఎల్లమ్మబజార్గల్లీ, సోఫాహైస్కూల్, మండిబజార్‌లో టీఆర్ఎస్ నాయకుడు బస్వరాజు శ్రీమాన్ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండీ మస్తాన్, బండారి సదానందం, సిరిబోయిన సదానందం, జన్ను శ్యామ్, శ్రీను, తరుణ్ పాల్గొన్నారు. 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో డివిజన్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించారు. 12వ డివిజన్ దేశాయిపేట, ఎన్పీఆర్నగర్, డాక్టర్కాలనీలో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ ఆధ్వర్యంలో సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్ ప్రతిభ, నాయకులు సోలా రాజు, కాశెట్టి వేణు, సీవో మాధవి, ఇన్స్పెక్టర్ విక్రమ్ పాల్గొన్నారు. 13వ డివిజన్లో కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. 21వ డివిజన్లో కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో పనులను పరిశీలించారు. 22వ డివిజన్లో కార్పొరేటర్ బస్వరాజ్ కుమారస్వామి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ నిబంధనలు పాటించాలి
పట్టణంలో ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛ సర్వేక్షణ్ నిబంధనలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని స్థానికులను కోరారు. మున్సిపల్ ట్రాక్టర్లు, సిబ్బంది వచ్చినప్పుడే చెత్తను అందించాలని కోరారు. ఆరుబయట మల, మూత్ర విసర్జన చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్‌ను వాడొద్దని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, కమిషనర్ నాయిని వెంకటస్వామి, కౌన్సిలర్లు దేవోజు తిరుమల, జుర్రురాజు, లూనావత్ కవిత, శీలం రాంబాబు, శ్రీదేవి, మినుములు రాజు, గందె రజిత, రాయిడికీర్తి దుశ్యంత్‌రెడ్డి, పాషా, నాగిశెట్టిపద్మ, గడ్డమీది సునీత, రుద్ర మల్లీశ్వరి, వేల్పుగొండ పద్మ, బోడ గోల్య, బానాల ఇందిర, దార్ల రమాదేవి పాల్గొన్నారు.