దుగ్గొండి, జూన్ 9: ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని అసిస్టెంట్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. దుగ్గొండి మండలం మందపల్లి ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆయన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులతో కలిసి పరిశీలించారు. సర్కారు బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించేలా గ్రామస్తులు ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ స్కూళ్లను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం ఆయన మందపల్లి, రాజ్యాతండాలో పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, పీఆర్ ఏఈ హరిదాస్యం, వెంకటేశ్వర్లు, సర్పంచ్ మొగ్గం మహేందర్, బానోత్ రవీందర్‌నాయక్, హెచ్ఎం రామ్మూర్తి పాల్గొన్నారు.
పిల్లలను బడిల్లో చేర్పించాలి
దుగ్గొండి/ఖానాపురం/చెన్నారావుపేట/గీసుగొండ/నల్లబెల్లి/పర్వతగిరి: బడీడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని దుగ్గొండి మండలం రేఖంపల్లి సర్పంచ్ ఇమ్మడి యుగేంధర్ కోరారు. రేఖంపల్లి, తొగర్రాయి, దుగ్గొండి, మందపల్లి, లక్ష్మీపురం, మహ్మదాపురంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సర్కారు బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులు విజయలక్ష్మి, నాగేశ్వరచారి, సారయ్య, వీరస్వామి, స్వరూప, దిడ్డి అనిల్, సారంగపాణి, రాజు పాల్గొన్నారు. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో సర్పంచ్ గొర్రె కవిత, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాటలో పాల్గొన్నారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. చెన్నారావుపేట మండలం జల్లికాలనీ గ్రామంలో ఉపాధ్యాయులు, నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో హెచ్ఎం సుజాత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే కలిగే ప్రయోజనాలను స్థానికులకు వివరించారు. టీచర్లు వెంకన్న, ఇమ్మానుయేల్, ఎస్ఎంసీ చైర్మన్ కౌక్కొండ శ్రీకాంత్ పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం కొండైల్పల్లెలో హెచ్ఎం రామస్వామి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. టీచర్లు ఉడుత రాజేందర్, సర్పంచ్ మామిండ్ల మొహన్రెడ్డి, అంగన్వాడీ కార్యకర్త రజిత, పల్లెప్రగతి స్పెషలాఫీసర్ శ్రీకాంత్‌రెడ్డి, జ్యోత్స్న, సునీత పాల్గొన్నారు. పర్వతగిరి మండలం కల్లెడ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు పనులను ప్రారంభించారు. సర్పంచ్ సంపెల్లి శోభ, ఉపసర్పంచ్ చీనూరి సోమయ్య, ఎస్ఎంసీ చైర్మన్ తక్కళ్లపల్లి శ్రీనివాస్, హెచ్ఎం సురేందర్, ఉపాధ్యాయులు మోత్కూరి నిరంజన్, ఏఈ, కార్యదర్శి మాధవ్, కిషన్, రాజు, వేణుగోపాల్ పాల్గొన్నారు.