నర్సంపేట/నర్సంపేట రూరల్/దుగ్గొండి, నవంబర్ 14: చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఆదివారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా నర్సంపేటలో నెహ్రూ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటలోని అక్షర పాఠశాలలో ప్రిన్సిపాల్ ఊడుగుల జ్యోతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నర్సంపేటలోని హృదయ స్పందన హోప్ సేవా సొసైటీలో అనాథ బాలలకు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పుస్తకాలు, నోటుబుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. నర్సంపేట మండలంలోని పలు పాఠశాలల్లో బాలల దినోత్సవం నిర్వహించారు. గుంటూరుపల్లిలో సర్పంచ్ కర్నాటి పార్వతమ్మ చిన్నారులకు పెన్నులు, పెన్సిళ్లు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. దుగ్గొండి మండలంలోని మందపల్లి, అడవిరంగాపురం, చలపర్తిలో పాఠశాలల్లో వేడుకలు జరిగాయి. గిర్నిబావిలోని ఎంజేపీటీలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి ఎస్వో దేవేందర్ బహుమతులు పంపిణీ చేశారు. హెచ్ఎంలు కూరోజు దేవేందర్, కర్ణకంటి రామ్మూర్తి, కనకయ్య, చంద్రమౌళి పాల్గొన్నారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
వర్ధన్నపేట/ఖానాపురం/చెన్నారావుపేట/గీసుగొండ/నెక్కొండ/కాశీబుగ్గ: వర్ధన్నపేట మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆదివారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ పాఠశాలలో చైర్మన్ వీ నరేందర్‌రెడ్డి నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రమేశ్‌యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం బాలికలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నదని, వాటిని వినియోగించుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. బాల్య వివాహాలు నేరమని, అలాంటి ఘటనలు ఉంటే వెంటనే చైల్డ్‌లైన్‌కు లేదా 100కు డయల్ చేయాలని సూచించారు. సదస్సులో ఎస్వో మౌనిక, పానల్ అడ్వకేట్స్ సంజయ్‌కుమార్, సునీత, డాక్టర్ ఉషారాణి, సీఆర్టీలు శారద, సమ్మక్క, నిర్మల పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని సిద్ధార్థ హైస్కూల్లో నెహ్రూ చిత్రపటానికి చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ అండెం కరుణాకర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పిల్లలకు పలు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చారి, కృష్ణమోహన్, రవి, శ్రీను, రమాదేవి, సృజన పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా గోపాల్‌నాయక్ నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. గీసుగొండ మండలవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దూరవిద్య కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో 16 డివిజన్ ధర్మారంలో పిల్లలతో కేక్‌కట్ చేయించి మిఠాయిలు పంపిణీ చేశారు. నెక్కొండలోని నెహ్రూ సెంటర్లో చాచా నెహ్రూ విగ్రహానికి టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు రాచకొండ రఘు, నాయకులు పాల్గొన్నారు. వరంగల్ కాశీబుగ్గ వెంకట్రామ జంక్షన్లో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందెల లాజర్, ముస్తఫా, పోగుల పరంజ్యోతి, ఆరెపల్లి అనిల్, కోడం మహేశ, రాజు, కల్యాన్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, కాశీబుగ్గలో కొదాటి అనిల్, జన్ను జీవన్ ఆధ్వర్యంలో చిన్నారులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.