నర్సంపేట రూరల్, జూన్ 7: అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషి.. ప్రజల భాగస్వామ్యంతోనే పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం అవుతుందని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవరత్నం అన్నారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరం, నాగుర్లపల్లి, భోజ్యానాయక్‌తండా, పర్శనాయక్‌తండాలో మంగళవారం ఆయన నర్సరీ, డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలను అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శులు, సిబ్బందికి సూచనలు చేశారు. అదేవిధంగా గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా విజయవంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, సర్పంచ్‌లు మాడ్గుల కవిత, కందికొండ రజిత, భూక్యా లలిత, బానోత్ గాంధీ, ప్రత్యేక అధికారులు కృష్ణకుమార్, ప్రియాంక, సందీప్, సంతోష్‌బాబు, కార్యదర్శులు, కారోబార్లు పాల్గొన్నారు. అలాగే, రాములునాయక్‌తండా, రాజపల్లి, ముగ్ధుంపురం, లక్నేపల్లి, రామవరం, ఇటుకాలపల్లి, ముత్తోజిపేట, రాజుపేట, గార్లగడ్డతండాలో సర్పంచ్‌లు అజ్మీరా మాధవి, నామాల భాగ్యమ్మ, పెండ్యాల జ్యోతి, గొడిశాల రాంబాబు, కొడారి రవన్న, మండల రవవీందర్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, దస్రూ, మాజీ ఎంపీటీసీ నామాల సత్యనారాయణ పనులను పర్యవేక్షించారు.
గ్రామాలు అభివృద్ధి సాధించాలి
గీసుగొండ: పల్లెప్రగతితో గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నాయని జడ్పీటీసీ పోలీసు ధర్మారావు అన్నారు. మండలంలోని శాయంపేట, బొడ్డుచింతలపల్లిలో ఆయన పారిశుధ్య పనులను పరిశీలించారు. పల్లెప్రగతితో గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు రాజబోయిన రజిత, కేదాసి అనిల్, ఎంపీటీసీ భిక్షపతి, ఏపీవో మోహన్‌రావు, ఎంపీవో ప్రభాకర్ పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని దుగ్గొండి ఎంపీడీవో కృష్ణప్రసాద్ కోరారు. ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, తాసిల్దార్ సంపత్‌కుమార్, ప్రత్యేకాధికారులు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. చలపర్తిలో అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎంపీడీవో కృష్ణప్రసాద్ సూచనలు చేశారు. నల్లబెల్లి మండలంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుధ్య పనులపై దృష్టి పెట్టారు. జీపీ సిబ్బంది డైనేజీలు, వీధులను శుభ్రం చేస్తూ పిచ్చిమొక్కలను తొలగించి గ్రామాలను సుందరీకరిస్తున్నారు. నల్లబెల్లిలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండడంతో కార్యదర్శి ధర్మేందర్ ప్రత్యేక దృష్టి సారించి శుభ్రం చేయిస్తున్నారు.
అలాగే, రుద్రగూడెంలో ఇటీవల దహనమైన పల్లెప్రకృతి వనాన్ని ఎంపీవో కూచన ప్రకాశ్ పరిశీలించారు. ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా పార్కులో మొక్కలు నాటి పునరుద్ధరిస్తామని ఎంపీవో తెలిపారు. పల్లెప్రకృతి వనాలను రక్షించాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఉందన్నారు. ఆయన వెంట సర్పంచ్ మల్లాడి కవిత, కార్యదర్శి పద్మనాభస్వామి, జీపి సిబ్బంది ఉన్నారు. నెక్కొండ మండలం అలంకానిపేటలో అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించారు. సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి, ఏఈవో వినేకర్, ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, వార్డు సభ్యులు చీకటి యాకలక్ష్మి-ఉపేందర్, సొసైటీ డైరెక్టర్ మాదాసు సుధాకర్ పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలంలో పల్లెప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. చెన్నారావుపేట, ఎస్సీకాలనీ, అమీనాబాద్‌లో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. ఎస్సీకాలనీలో పిచ్చిమొక్కలను తొలగించి వీధులను శుభ్రం చేయించారు.
కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు సంపత్, మంజీలాల్, కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు. రాయపర్తి మండలకేంద్రంతోపాటు కొండాపురం, మైలారం, కాట్రపల్లి సర్పంచ్‌లు గారె నర్సయ్య, కోదాటి దయాకర్‌రావు, లేతాకుల సుమతీ యాదవరెడ్డి, బోనగిరి ఎల్లయ్య ఆధ్వర్యంలో గ్రామాల్లో పారిశుధ్య, శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోరుతూ బడిబాట ర్యాలీలు నిర్వహించారు. మైలారం, కాట్రపల్లిలో డ్రైనేజీలను శుభ్రం చేశారు. కార్యదర్శులు గుగులోత్ అశోక్‌నాయక్, జేరిపోతుల రాజబాబు, పెంచల విజేందర్, కారోబార్లు రాంచంద్రయ్య, శ్రీనివాస్, ఉప్పలయ్య, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.