పర్వతగిరి, జూన్ 7: మండల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదని, త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధికారులు, ప్రజాప్రతిని ధులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన అభివృద్ధి పనులపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారు లు, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ నాణ్యతలో రాజీప డే ప్రసక్షే లేదని, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించా రు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి పర్వతగిరి మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. సమీక్షలో ఎంపీపీ కమలా పంతులు, జడ్పీటీసీ సింగ్‌లాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శాంతిరతన్‌రావు, ఏకాంతంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, సర్వర్, జితెందర్‌రెడ్డి, చిన్నపాక శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమడగాని రాజు యాదవ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.