నర్సంపేట/నర్సంపేటరూరల్/ఖానాపురం, ఏప్రిల్ 7: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లో గురువారం నిర్వహించిన నిరసన దీక్షకు నర్సంపేట నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ జిల్లా నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, ఆర్ఎస్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వరంగల్‌కు వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, ఎంపీపీ విజేందర్, జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు ఉన్నారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో వరంగల్‌లో నిర్వహించిన రైతు నిరసన దీక్షకు తరలివెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, ప్రజాప్రతినిధులు, నాయకులు కొడారి రవన్న, గొడిశాల రాంబాబు, గోలి శ్రీనివాస్‌రెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, అల్లి రవి, రాజ్‌కుమార్, తాళ్లపెల్లి రాంప్రసాద్, సుధాకర్, రాజు, రవి, రమేశ్, సురేశ్ పాల్గొన్నారు. ఖానాపురం మండలం నుంచి ఎంపీపీ ప్రకాశ్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్‌లు కాస ప్రవీణ్‌కుమార్, హఠ్య, వెన్ను పూర్ణచందర్, తక్కళ్లపల్లి రమేశ్, బొప్పిడి పూర్ణచందర్, నాగార్జునరెడ్డి, లాదినేని ఎల్లయ్య, బంగారపు శ్రీను, బూస అశోక్, బాషబోయిన ఐలయ్య తదితరులు వెళ్లారు.
ఉత్సాహంగా తరలిన నేతలు..
ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్‌లోని ఓసిటీ మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి రైతు నిరసన దీక్షకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ వర్ధన్నపేటలోని జాతీయ రహదారిపై వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. రాయపర్తి మండలంలోని 39 జీపీల పరిధిలోని టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, రైతులు ప్రత్యేక వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు పాల్గొన్నారు. పర్వతగిరి మండలం నుంచి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, పర్వతగిరి సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ చిన్నపాక శ్రీనివాస్, ఎంపీటీసీ మాడ్గుల రాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమడగాని రాజు, బొట్ల మధు, రంగు జనార్దన్, పీఏసీఎస్‌ల చైర్మన్లు మనోజ్‌కుమార్‌గౌడ్, గొర్రె దేవేందర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శాంతిరతన్‌రావు, ఏకాంతంగౌడ్, రైతులు తదితరులు తరలివెళ్లారు. నల్లబెల్లి మండలంలోని 24 గ్రామ పంచాయతీల నుంచి వరంగల్‌లో చేపట్టిన దీక్షకు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు, ఎంపీటీసీ జన్ను జయరావు, పాండవుల రాంబాబు, గోనెల నరహరి, పిట్టల ప్రవీణ్, రామస్వామి, లక్ష్మీనారాయణ, పరికి రత్నం పాల్గొన్నారు.