ఖిలావరంగల్, ఏప్రిల్ 2: వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో హర్యానా రాష్ర్టానికి చెందిన మద్యం బాటిళ్లను ఖిలావరంగల్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నాడు. ఖిలావరంగల్ ఎక్సైజ్ సీఐ బీ చంద్రమోహన్ కథనం ప్రకారం.. వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఎక్సైజ్ పోలీసులు నిఘా పెట్టారు. కొత్తగూడకు చెందిన మనగాని వినోద్(50), మనగాని సంతోష్‌కుమార్, తుమ్మల సాయికుమార్, లక్క నరేశ్ బ్యాగ్‌లతో అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే పోలీసులు వీరి వద్ద ఉన్న నాలుగు ట్రాలీ బ్యాగ్‌లు తనిఖీ చేయగా, అందులో 750 ఎంఎల్ మద్యం సీసాలు 50 కనిపించాయి. వీటిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. లక్క నరేశ్ పారిపోయాడు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ నలుగురు కొంతకాలంగా హర్యానా రాష్ట్రం నుంచి సుంకం చెల్లించని మద్యాన్ని వరంగల్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు. తనిఖీల్లో ఎస్సై రేష్మా సుల్తానా, సిబ్బంది రాజు, చిరంజీవి, కరుణాకర్ పాల్గొన్నారు.