e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home వరంగల్ రూరల్ విత్తన షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

విత్తన షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

విత్తన షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

పరకాల, జూన్‌ 8: పట్టణంలోని ఫర్టిలైజర్‌, విత్తన షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఓ షాఫులో అనుమతి లేని మిర్చి విత్తనాలను స్వాధీనం చేసు కున్నారు. ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ సీఐ రవికుమార్‌ ఆధ్వర్యం లో స్థానిక పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం పట్టణంలోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా పరమేశ్వరి ఆగ్రో ఏజన్సీస్‌లో ప్రభు త్వ అనుమతి లేకుండా విక్రయిస్తున్న ధనూక సీడ్స్‌కు చెం దిన స్టార్‌ బిందు అనే మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకు న్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్ర కారం.. ఖమ్మం జిల్లాలో ఇటీవల కొన్ని అనుమతి లేని విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశాం. ఈ కేసు విచారణలో పరకాల పట్టణంలో కూడా విక్రయాలు జరుగుతున్నాయని తెలుసుకుని స్థానిక పోలీసులు, వ్యవ సాయ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వ హించాం. దీంతో రూ.80 లక్షల విలువ చేసే అను మతులు లేని 4,400 ప్యాకెట్ల మిర్చి విత్తనా లను స్వాధీనం చేసుకున్న ట్లు తెలిపారు. ఈ తనిఖీ ల్లో సీఐ పింగిళి మహేం దర్‌రెడ్డి, ఏడీఏ రవీందర్‌, మండల వ్యవసాయ అధికారి ఎస్‌ శ్రీనివాస్‌, పరకాల రూరల్‌ సీఐ రమేశ్‌కుమార్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

అడ్డుకునే ప్రయత్నం
అనుమతి లేని మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకుని అధికారులు వాహనంలో తరలిస్తుండగా ఫర్టిలై జర్‌, విత్తన షాపుల నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక సీఐ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా పోలీసులతో వాగ్వాదా నికి దిగారు. ఇదే సమయంలో షాపు నిర్వాహకుడి కుమా రుడు విత్తనాలను స్వాధీనం చేసుకోవద్దంటూ పురుగుల మందు చేత పట్టుకుని తాగే ప్రయత్నం చేయగా సీఐ అడ్డు కుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
దామెర, జూన్‌ 8: నకిలీ విత్తనాలను విక్రయిస్తే చట్టరీ త్యా కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఏసీపీ శ్రీనివా స్‌ హెచ్చరించారు. దామెర మండల కేంద్రంలోని చంద్రకళ సీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ గోదామును ఏసీపీ మంగళ వారం సాయంత్రం తనిఖీ చేశారు. సీడ్స్‌తోపాటు లైసెన్స్‌, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మా ట్లాడుతూ నకిలీ విత్తనాల తయారీతోపాటు పక్క రాష్ర్టాల నుంచి అనుమతి లేకుండా వచ్చే విత్తనాలను ఫర్టిలైజర్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ షాపుల యజమానులు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. నకిలీ విత్తనాల గు రించి ఎవరికైనా తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. నాణ్యత, గుర్తిం పు పొందిన విత్తనాలను మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని, విత్తన కొనుగోలు రశీదును తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భాస్కర్‌ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విత్తన షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

ట్రెండింగ్‌

Advertisement