హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 16 : పరిశ్రమలు, సమాజ హితం, ఉద్యోగావకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా స్టార్టప్‌లను అభివృద్ధి చేయా లని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అన్నారు. నిట్‌లో శనివారం ఇండస్ట్రీ ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని సంస్థలన్నీ సామాజిక సమస్యలను పరిషరించే స్టార్టప్‌లను అభివృద్ధి చేయడం ప్రారంభించాలన్నారు. భువనేశ్వర్ సీఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ డైరెక్టర్ రామానుజ నారాయణ్ మాట్లాడుతూ.. చా లామంది విద్యార్థులు అమెరికా వెళ్లాలని కలలు కంటున్నారని, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇతర కంపెనీలకు భారతసంతతి వారే సీఈవోలుగా ఉన్నారని, దేశంలో ఎకడ లోపం ఉంది.. ఇక్కడి ఇంజినీర్లు, మేధావులు విదేశాలకు వ లస వెళ్లకుండా చూడాలని పేర్కొన్నా రు. దేశం ఎదురొంటున్న అతిముఖ్యమైన సమస్య నిరుద్యోగం అని, ఎంట ర్ప్రెన్యూర్షిప్ ద్వారా అవకాశాలను సృష్టించడం గురించి ఆలోచించడం ప్రారంభిస్తే ఈ సమస్యను పరిషరించవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ గ్లోరీ స్వరూప అన్నారు. కంపెనీలను సృష్టించే దిశగా అన్ని ఎన్ఐటీలు పనిచేయాలని కోరారు.
అలాగే డీఆర్డీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జేఆర్ జోషి ఇతర దేశాల్లో పరిశోధనల అంశాలపై వివరించారు. మే 2023 ప్రకారం దేశంలోని 670 జిల్లాల్లో 99వేల స్టార్టప్‌లు ఉన్నాయని చెప్పారు. ‘పరిశ్రమలకు సహాయపడే పరిశోధన ఆలోచనలను అభివృద్ధి చేయాలన్నారు. ఎన్ఐటీలలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని, ప్రపంచ స్థాయి సమస్యలను పరిషరించడంలో పరిశ్రమల విభాగంతో సమన్వయం చేసుకుంటూ ఎన్ఐటీలు పనిచేయాలని సూచించారు.
ఐఐఎంటీ-వరంగల్ నిట్ ఒప్పందం..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ) భువనేశ్వర్‌తో వరంగల్ నిట్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. పరిశోధన, కన్సల్టింగ్ను బలోపేతం చేయడానికి ఎంవోయూ సహాయపడుతుందని నిట్ డైరెక్టర్ తెలిపారు. ఎంఓయూ ప్రకారం రెండు సంస్థలు పరిశోధనా సౌకర్యాలను పంచుకుంటాయని, బాహ్యనిధుల కోసం ఉమ్మడి పరిశోధన ప్రతిపాదనలను అభివృద్ధి చేస్తాయన్నారు. ఈ మేరకు ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్, భువనేశ్వర్ సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ డైరెక్టర్ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి మార్పిడీ చేసుకున్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తమ విలువైన సహకారాన్ని అందించిన అన్ని ఎన్ఐటీలకు నిట్ డైరెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. రెండు రోజుల పాటు జరిపిన అన్ని చర్చలను సారాంశాలను డాక్యుమెంట్ చేస్తామని చెప్పారు. ఎన్ఐటీ వరంగల్‌లో మొదటి రీసెర్చ్ కాన్క్లేవ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్ఐటీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ డీన్ ప్రొఫెసర్ సోమశేఖర్, అసోసియేట్ డీన్లు ప్రొఫెసర్ వాసు, ప్రొఫెసర్ శిరీష్ సోనావానే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.