టీజీ-20లో మనోళ్లు
తెలంగాణలో తొలిసారిగా బీసీసీఐ ఆమోదంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించనున్న తెలంగాణ టీ20 (టీజీ 20)కి వరంగల్ జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి జూలై 11 వరకు హెచ్‌సీఏ, టీజీ గవర్నింగ్ కౌన్సిల్ సంయుక్తంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లీగ్‌ను నిర్వహించనున్నారు.
- క్రికెట్ ప్రీమియర్ లీగ్‌కు ఎంపికైన నలుగురు కుర్రాళ్లు
- అమ్ముడుపోయిన పార్దిపన్, సతీశ్, వైష్ణవ్, సుధామ్ష్
- సిరాజ్‌ను రూ.14లక్షలకు కొనుగోలు చేసిన వరంగల్ వారియర్స్
హనుమకొండ చౌరస్తా, జూన్ 8: తెలంగాణలో తొలిసారిగా బీసీసీఐ ఆమోదంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించనున్న తెలంగాణ టీ20 (టీజీ 20)కి వరంగల్ జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 20 నుంచి జూలై 11 వరకు హెచ్‌సీఏ, టీజీ గవర్నింగ్ కౌన్సిల్ సంయుక్తంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లీగ్‌ను నిర్వహించనున్నారు. మొత్తం 8 జట్లు 28 రోజుల పాటు 32 మ్యాచ్ లు ఆడనున్నాయి.
ఈ లీగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగిన ప్లేయర్ల మెగా వేలం ప్రక్రియ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో కొనసాగింది. ప్ర తిభ ఆధారంగా 8 ఫ్రాంచైజీలు క్రీడాకారులను కొనుగోలు చేశాయి. స్టార్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్‌ను వరంగల్ వారియర్స్ ఫ్రాంచైజీ బైన గ్లోబల్ రిసోర్స్ సంస్థ రూ.14 లక్షలకు కొనుగోలు చే సింది. హెచ్‌సీఏ నిర్వహించిన డివిజన్ ఏ, డివిజన్ బీ కి సంబంధించి వివిధ స్థాయిల్లో వరంగల్ జట్టుకు ప్రా తినిధ్యం, జిల్లాలో నిర్వహించిన ఇంట్రా డిస్ట్రిక్ట్, కాక టోర్నమెంట్, వివిధ టీ 20 పోటీల్లో పాల్గొన్న వారి ప్రతిభ ఆధారంగా వివిధ సంస్థలు కొనుగోలు చేశా యి.
వరంగల్ జిల్లా క్రీడాకారులు జంబోజు పార్దిపన్ (ఆల్ రౌండర్)ను పాలమూరు స్ట్రైక్ రూ.75 వేలకు, బానోత్ సతీశ్‌కుమార్ (ఫాస్ట్ బౌలర్)ను కరీంనగర్ డిమాండ్స్ రూ.లక్షకు, విశ్వనాథ వైష్ణవ్ (లెగ్ స్పిన్నర్ కం బ్యాట్స్‌మెన్)ను రూ.లక్షకు వరంగల్ వారియర్స్, బీరవోలు నాగ సుధామ్ష్రెడ్డి (లెగ్ స్పిన్నర్ కం బ్యాట్స్‌మెన్)ను నల్గొండ కింగ్స్ రూ.75వేలకు కొనుగోలు చే శాయి. దీంతో జిల్లా క్రికెట్లో సరికొత్త శకానికి నాంది పలికినట్లయింది. ఎంపికైన నలుగురు క్రీడాకారులను వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగం టి శ్రీనివాస్, సీనియర్ క్రికెటర్లు అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

