‘జనగణమన అధినాయక జయహే.. భారత భాగ్య విధాత’ అంటూ జాతీయ గీతం మార్మోగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లా అంతటా మంగళవారం ఉదయం 11.30గంటలకు నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కడివారక్కడ నిలబడి గీతాలాపన చేయగా దేశభక్తి వెల్లివిరిసింది. ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాలతో తరలిరాగా, కూడళ్లు, దారులన్నీ మువ్వన్నెలతో మెరిసిపోయాయి. వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కాలేజీ మైదానంలో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ గోపి సామూహికంగా గీతాన్ని ఆలపించారు. నాయుడుపంపు జంక్షన్లో టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని దేశభక్తిని చాటారు. ఎంజీఎం ప్రధాన కూడలిలో వైద్యులు, పోలీసులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేశారు.
నమస్తే నెట్వర్క్: మువ్వన్నెల జెండాలతో జనమంతా కదిలారు. ఎక్కడికక్కడ సామూహిక జాతీయ గీతాన్ని ఆలపించా రు. భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30గంటలకు ప్రజాప్రతినిధులు, అధి కారులు, విద్యార్థులు, ప్రజలు తరలివచ్చి గీతాలాపన చేశారు. మువ్వన్నెల జెండాలు చేతబూని భార త్మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు చేన్లలో, ప్రయాణికులు బస్సుల్లో జాతీయ జెండాకు వందనం చేస్తూ గీతాన్ని పాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరా థోడ్ జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. డోర్నకల్‌లో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పాల్గొన్నారు. కురవిలో ఆర్టీసీ బస్సును పక్కన నిలిపి డ్రైవర్, కండక్టర్‌తోపాటు ప్రయాణికులు బస్సులోనే జాతీయ గీతాలాపన చేశారు. దంతాలపల్లి, కేసముద్రం, నర్సింహులపేట మండలాల్లోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు, కూలీలు జాతీయ గీతాలాపన చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ఎస్పీ జే సురేందర్‌రెడ్డి ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగా ల సంపత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ హమీద్, ఆర్డీవో మధుమోహన్ పాల్గొని గీతాలాపన చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని మసీదు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ప్రజలు, ప్రజాపత్రినిధులు, అధికారులు, వ్యాపారులు స్వచ్ఛందంగా మానవహారంగా ఏర్పడి జాతీయ గీతాన్ని ఆలపించారు. త్రివర్ణపతాకాలకు వందనం చేశారు. కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్, ఏఎస్పీ సుధీర్రామ్నాథ్కేకన్, ఓఎస్డీ గౌస్ఆలం తదితరులు పాల్గొన్నారు. హనుమకొండలోని అంబేదర్ సరిల్ ప్రాంతంలో ఎమ్మె ల్సీ కడియం శ్రీహరి జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కాలేజీ మైదానంలో ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యా ర్థులు మువ్వన్నెల జెండాను పట్టుకుని సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్లు హరీసింగ్, శ్రీవత్స కోట తదితరులు పాల్గొన్నారు. ఎంజీఎం ప్రధాన కూడలిలో సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు డాక్టర్ మురళి, డాక్టర్ ప్రసాద్‌తోసహా పలు విభాగాధిపతులు, వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. కాళోజీ హెల్త్ యూ నివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్ పాల్గొన్నారు. నాయుడుపంపు జంక్షన్లో టీఆర్ఎస్ జిల్లా అధ్య క్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ గీతాలాపన చేశారు.