వరంగల్, ఆగస్టు 10 : స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు నగరంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం కార్పొరేషన్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయాన్ని జాతీయ పతాకం రంగుల్లో విద్యుత్ దీ పాలతో అలంకరించాలన్నారు. నగరంలోని ప్ర ధాన కూడళ్లను సుందరీకరించాలన్నారు. బల్ది యా ఆవరణలో వజ్రోత్సవాలు ప్రతిబింబించేలా స్తూపం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీడం పార్కులను ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. 11న కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ఫ్రీడం రన్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు.
13న బల్దియాలో 75 సంవత్సరాల స్వాతంత్య్ర బెలూన్ ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలన్నా రు. 16న 66 మంది కార్పొరేటర్ల నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర గీతాలాపన కార్యక్రమానికి సౌం డ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. 19న పలివేల్పుల, క్రిష్టియన్ కాలనీలోని నైట్ షెల్టర్స్, అనాథాశ్రమాల్లోని వారికి పండ్లు పంపి ణీ చేయాలన్నారు. 20న వరంగల్, హనుమకొం డ ప్రాంతాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. 21న కార్పొరేషన్ ప్రత్యేక కౌన్సి ల్ సమావేశం నిర్వహించాలన్నారు. సమావేశం లో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, కార్యద ర్శి విజయలక్ష్మి, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, సీహెచ్‌వో శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్‌రెడ్డి, ఈఈలు లక్ష్మారెడ్డి, డీఈ రవికుమార్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సేవలు ప్రశంసనీయం..
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బల్దియా కార్మికుల సేవలు ప్రసంశనీయమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా కార్యాలయంలో ఐటీసీ-వావ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. చెత్త సేకరణలో ఉత్తమ సేవలు అందిస్తున్న కార్మికులను సన్మానించారు. ఉత్తమ సేవలు అందిస్తున్న కార్మికులను గుర్తించి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. సిబ్బంది చెత్త సేకరణ సమయంలో ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా నగరవాసులకు అవగాహన కల్పించాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన కార్మికులను సన్మానించి జాతీయ జెండాలు అందచేశారు. కార్యక్రమంలో సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, శానిటరీ సూపర్వైజర్ మాదాసి సాంబయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు గోల్కొండ శ్రీను, కరుణాకర్, ఐటీసీ, వావ్ కో ఆర్డినేటర్ కిరణ్, ఫీల్డ్ కో ఆర్డినేటర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.