వర్ధన్నపేట/కరీమాబాద్, ఆగస్టు 4: తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అని వర్ధన్నపేట సీడీపీవో శ్రీదేవి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం వర్ధన్నపేటలోని ప్రభుత్వ దవాఖానలో పిల్లలకు తల్లిపాలు పట్టించారు. ఇల్లందలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించడం వల్ల పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు. పిల్లలకు డబ్బా పాలు పట్టిస్తే వారిలో ఎదుగుదల ఉండదన్నారు. తరచూ వ్యాధులబారిన పడుతారని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, ఆశ వర్కర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కరీమాబాద్‌లో స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ పెరుమాండ్ల ఆశాదేవి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యకరం
ఖానాపురం/నర్సంపేటరూరల్/నల్లబెల్లి: తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయని ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు చేశారు. ఈ సందర్భంగా బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. కనీసం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు పిల్లలకు తల్లులు పాలివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమనావాణి, సర్పంచ్ చిరంజీవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం సునీత పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లిలో మహిళలకు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఎంపీపీ మోతె కళావతి మాట్లాడుతూ తల్లిపాలతో శిశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. నల్లబెల్లి మండంలోని మూడుచెక్కలపల్లె, నారక్కపేటలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అంగన్వాడీ సిబ్బంది అన్నప్రాసన చేశారు. అంగన్వాడీ టీచర్ కే విజయ, సర్పంచ్ వక్కల మల్లక్క, అంగన్వాడీల సంఘం మండల అధ్యక్షురాలు బంధం వెంకటలక్ష్మి, రమాదేవి, శరణ్య, జీ విజయ, జయమ్మ, మణెమ్మ, ఆశ కార్యకర్త కవిత పాల్గొన్నారు.
తల్లిపాలు పిల్లలకు వరం
పోచమ్మమైదాన్/సంగెం: తల్లిపాలు పిల్లలకు వరంలాంటివని సీడీపీవో విశ్వజ అన్నారు. కాశీబుగ్గ సెక్టార్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు తిలక్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం లోతుకుంటలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన తల్లుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తల్లులు తప్పనిసరిగా పిల్లలకు పాలు పట్టాలని కోరారు. కార్యక్రమంలో వరంగల్ ప్రాజెక్టు సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ, సీకేఎం హెల్త్ సూపర్వైజర్ మక్సూద్, అంగన్వాడీ టీచర్ సత్యవేద పాల్గొన్నారు. సంగెం మండలంలోని మొండ్రాయిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గూడ కుమారస్వామి మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు శ్రేష్టమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు దామెరుప్పుల శ్రీలత, పూజరి రజిత, స్వరూప, ఆయాలు, ఆశలు పాల్గొన్నారు.