కొత్తగూడ, ఆగస్టు 3 : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని వేలుబెల్లి శివారు పంట పొలాల్లో బుధవారం సుడిగాలి బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వచ్చిన టోర్నడోతో స్థానిక రైతులు ఆందోళన చెందారు. మడుల్లో నాట్లు వేస్తున్న కూలీలు ఒక్కసారిగా పరుగులు తీశారు. భారీ సుడిగాలికి స్థానిక పంట పొలాల్లోని నీరు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతూ పైకి లేచి ఆవిరైపోయింది.
అమెరిక సంయుక్త రాష్ర్టాల్లో ఇలాంటి టోర్నడోలు ఎక్కువగా కనిపిస్తాయని, మన వద్ద చాలా అదురుగా జరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువగా సముద్రాలు, నదుల్లో సంభవించే ఈ టోర్నడోలు వేలుబెల్లి పంటపొలాల్లో కనిపించేసరికి ఉమ్మడిజిల్లావాసులు ఆశ్చర్యపోయారు.