తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభం
నర్సంపేట రూరల్, ఆగస్టు 1: ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలని కోర్సు డైరెక్టర్ ఎం వసుమతి సూచించారు. మహేశ్వరం శివారు సెయింట్ మేరీ హైస్కూల్లో సోమవారం ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వసుమతి హాజరై మాట్లాడుతూ శిక్షణలో ఉపాధ్యాయులు మెళకువలు నేర్చుకొని విద్యార్థులకు చక్కగా బోధించాలన్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించేందుకు కృషి చేయాలని సూచించారు. శిక్షణలో గ్రహించిన విషయాలను తరగతి గదిలో విద్యార్థులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అబ్జర్వర్ బొమ్మెర కుమారస్వామి, హెచ్ఎం జయప్రద, ఆర్పీలు రవీందర్, విజేందర్‌రావు, సాధియ రఫిత్, కరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నాణ్యమైన బోధనకు ‘తొలిమెట్టు’
రాయపర్తి/సంగెం/పోచమ్మమైదాన్: రాష్ట్ర ప్రభుత్వం-రాష్ట్ర విద్యాశాఖల సంయుక్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న తొలిమెట్టు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నాణ్యమైన విద్యాబోధనకు దోహదం చేస్తుందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎం సారయ్య అన్నారు. రాయపర్తిలోని జడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. శిక్షణలో ఉపాధ్యాయులు పాల్గొ ని మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంఈవో నోముల రంగయ్య, కోర్సు డైరెక్టర్ అజ్మీరా ఉమాదేవి, రిసోర్స్ పర్సన్స్ ఎం సతీశ్‌కుమార్, వెంకటేశ్వర్రావు, రజినీకాంత్‌రెడ్డి, వెంకటరమణ, ఎమ్మార్సీ సిబ్బంది జే యాకయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. సంగెం మండలం గవిచర్ల మోడల్ స్కూల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణ శిబిరం ప్రారంభమైంది.
ఈ శిబిరాన్ని జిల్లా పర్యవేక్షణాధికారి శ్రీనివాస్ సందర్శించారు. సెకండ్ ఫేజ్ శిక్షణ బుధవారం నుంచి 6వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ముజుబుర్ రహమాన్, అబ్జర్వర్ అంజివర్ధన్రెడ్డి, ఆర్పీలు స్రవంతి, భావన, భాస్కరాచారి, శ్రీనివాస్, సీఆర్పీలు డీ శ్రీధర్, మంజుల పాల్గొన్నారు. అలాగే, వరంగల్ ఎల్బీనగర్లోని ఇస్లామియా బీఎడ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఓరియేంటేషన్ ప్రోగ్రాంను అబ్జర్వర్ బీ కుమారస్వామి, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. ఎంఈవో విజయ్‌కుమార్, కోర్సు డైరెక్టర్ లచ్చిరాంనాయక్, సీఆర్పీ రమేశ్ పాల్గొన్నారు.