నర్సంపేట, ఆగస్టు 1: ఆటో డ్రైవర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సంపేటలో ప్రపంచ ఆటో డ్రైవర్స్ డే దినోత్సవాన్ని తాడు డివిజన్ అధ్యక్షుడు కల్లెపెల్లి సురేశ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కేక్‌కట్ చేశారు. అనంతరం ర్యాలీ తీశారు. నవ తెలంగాణ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని తెలిపారు. ఆటో డ్రైవర్లకు రోడ్డు ట్యాక్సీని రద్దు చేసిందన్నారు.
గతంలో ఉన్న బకాయిలను కూడా మాఫీ చేశారన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మృతి చెందితే ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు వీలుగా రూ.5 లక్షల బీమాను కూడా అమలు చేస్తున్నదన్నారు. ఆటో కార్మికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని పేర్కొన్నారు. ఆటో కార్మికులను అన్నివిధాలా ఆదుకుంటున్నదని తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు వెళ్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆటో డ్రైవర్లకు అన్ని పథకాలు వర్తించేలా చూస్తున్నారన్నారు. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా డ్రైవర్ల అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు సేవలు అంది స్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు రవాణా సేవలు అందించడంలో ఆటో డ్రైవర్లు కీలకంగా పని చేస్తున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషిచేస్తానని తెలిపారు. నిత్యం నర్సంపేటలోనే అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. నాయకులు తాడు జిల్లా గౌరవాధ్యక్షుడు కే సురేశ్, నల్లా మనోహర్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర కమిటీ సభ్యులు రాయిడి రవీందర్‌రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, పుల్లూరిస్వామి, ఇస్రాం కుమార్, కొమ్మువినయ్, భాస్కర్, ఎం రాంబాబు, నర్సయ్య, రాజేందర్, నవీ న్, రాజేశ్, సూరయ్య, రాజు, సురేశ్ పాల్గొన్నారు.
ఆటో కార్మికులకు అండగా ప్రభుత్వం
ఎమ్మెల్యే అరూరి రమేశ్
హసన్‌పర్తి: ఆటో కార్మికులుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండ గా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొ న్నారు. ప్రపంచ ఆటో డ్రైవర ్లదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఆటో డ్రైవర ్లయూనియన్ ఆధ్వర్యంలో సోమవారం చింతగట్టుక్యాంప్లో ఆటో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చింతగట్టుక్యాంప్ నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు ఆటో నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్, నరెడ్ల శ్రీధర్, ఏరుకొండ శ్రీనివాస్, అటికం రవీందర్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.