టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. అలాగే, వాడవాడలా కేక్‌లు కట్ చేసి సంబురాలు నిర్వహించడంతో పండుగ వాతావరణం నెలకొంది. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నర్సంపేట/చెన్నారావుపేట/ఖానాపురం, జూలై 24: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేటలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి హారతి తీసుకున్నారు. చెన్నారావుపేటలో టీఆర్ఎస్ నాయకుడు కృష్ణచైతన్య గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా పేదలకు బియ్యం పంపిణీ చేశారు. నంబర్‌వన్ కాలనీకి చెందిన ఐదు కుటుంబాలకు 25 కిలోల చొప్పున 1.25 క్వింటాళ్ల బియ్యం అందించారు. వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, ఉపాధ్యక్షుడు నరేందర్, నాయకులు పాల్గొన్నారు. అలాగే, మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బాల్ని వెంకన్న శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
కార్యక్రమంలో సర్పంచ్ కుండె మల్లయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్, ఉపాధ్యక్షుడు నరేందర్, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖానాపురం మండలం బుధరావుపేట వేంకటేశ్వరాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. అనంతరం ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్, బూస అశోక్, నాగరాజు, బాలు, శ్రీను, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, బత్తిని నర్సయ్య, రాజశేఖర్, కుమారస్వామి పాల్గొన్నారు.
కేక్‌లు కట్ చేసి.. సంబురాలు జరిపి..
వర్ధన్నపేట/నెక్కొండ: మంత్రి కేటీఆర్ జన్మదినం సంద ర్భంగా వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికులు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే, వర్ధన్నపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కట్య్రాలలో ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ ఏ మోహన్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమారస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నెక్కొండలో ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య కేక్ కట్ చేసి సంబురాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, మండల నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, తాటిపెల్లి శివకుమార్, కట్కూరి నరేందర్‌రెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, మాదాసు రవి, దొనికెన సారంగపాణి, ఈదునూరి యాకయ్య, గరికపాటి కృష్ణారావు, ఎంపీటీసీలు కర్పూరపు శ్రీనివాస్, లింగాల అజయ్, దస్రు, బళ్ల వెంకన్న, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, సర్పంచ్‌లు మహబూబ్‌పాషా, మాదాసు అనంతలక్ష్మీరవి, బదావత్ స్వరూపా రవి, చంద్రమౌళి, నాయకులు బొడ్డుపల్లి రవి, జుట్టుకొండ వేణు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన టీఆర్ఎస్ శ్రేణులు
గీసుగొండ/సంగెం/రాయపర్తి/నర్సంపేటరూరల్: గీసుగొండ మండలం కొమ్మాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి 100కు పైగా మొక్కలు నాటారు. గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లో కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, సుంకిరి మనీషా శివకుమార్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. గొర్రెకుంట క్రాస్‌రోడ్డులో టీఆర్ఎస్ నేతలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్, మండల కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, యూత్ నాయకులు శ్రీకాంత్, జూలూరి లెనిన్, శ్రీకాంత్, పాల్గొన్నారు. సంగెం అంబేద్కర్ కూడలిలో ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు సారంగపాణి, జక్క మల్లయ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో మంత్రి కేటీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. మైలారం, పెర్కవేడు, కొండూరు, తిర్మలాయపల్లిలో మొక్కలు నాటారు. ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వెంకటేశ్వరపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, మచ్చ సత్యం, నాగపురి సోమయ్య, గుగులోత్ జాజునాయక్, కుక్కుడపు జయశ్రీ పాల్గొన్నారు.
రాయపర్తిలో సర్పంచ్ గారె నర్సయ్య పూరి గుడిసెలో నివాసముంటున్న అనాథ బాలింతకు 25 కేజీల బియ్యం అందించారు. నర్సంపేట మండలం రాజుపేటలో టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు భారీ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, రాజుపేట సర్పంచ్ బానోత్ దస్రూ, ఎంపీటీసీ వీరన్న, మండల నాయకులు కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, తండ వెంకటేశ్వర్లు, కోతి చలం, బానోత్ శంకర్, భూక్యా వీరు, బండారి రమేశ్, అల్లి రవి, వల్లాల కరుణాకర్, పత్రి కుమారస్వామి, గంధం జగన్మోహన్రావు, వల్గుబెల్లి ప్రతాప్‌రెడ్డి, గోవర్ధన్, రవి, బాలాజీ, సమ్మయ్మ, సుధాకర్ పాల్గొన్నారు.
గ్రేటర్లో యువనేత జన్మదిన వేడుకలు
కరీమాబాద్/వరంగల్‌చౌరస్తా/గిర్మాజీపేట/కాశీబుగ్గ: యువనేత మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను గ్రేటర్ వరంగల్‌లోని 32, 39, 40, 41, 42, 43వ డివిజన్లలో ఆదివారం టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. టీఆర్ఎస్ నాయకుడు కోరె కృష్ణ ఆధ్వర్యంలో మేడారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ, 42వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కేడల పద్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. తూర్పు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, అన్నపూర్ణ పరపతి సంఘం సభ్యులు మంత్రి కేటీఆర్‌పై ఉన్న అభిమానంతో రాజస్థాన్‌లోని అజ్మీరా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్, పెంచాల నర్సయ్య, పెంచాల కుమారస్వామి, సురేశ్, కొత్త వెంకటకృష్ణ, తోట రుక్మిణి పాల్గొన్నారు. 36వ డివిజన్ చింతల్లో డిప్యూటీ మేయర్ రిజ్వనా షమీమ్ మసూద్ కేక్ కట్ చేశారు.
అనంతరం సీఎస్ఐ చర్చిలో కేటీఆర్ ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పనానవీన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. బృందావన్‌కాలనీ, ఎన్టీఆర్కాలనీ, పెంతేస్త చర్చి, పిన్నావారివీధి, స్టేట్‌హౌస్, మేదరవాడలో కేక్ కట్ చేశారు. 14 ఆలయాల్లో అభిషేకం చేశారు. సీకేఎం దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 25, 26, 33వ డివిజన్లలో కార్పొరేటర్లు బస్వరాజు శిరీషాశ్రీమాన్, బాలిన సురేశ్, ముష్కమల్ల అరుణాసుధాకర్ కేక్ కట్ చేశారు. కాశీబుగ్గ 19వ డివిజన్లో కార్పొరేటర్ ఓని స్వర్ణలత, 20వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, 21వ డివిజన్ కార్పొరేటర్ ఫుర్కాన్, 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను షీభారాణి, 23వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ యెలగం లీలావతి సత్యనారాయణ, గనిపాక సుధాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల మొక్కలు నాటారు. కొత్తవాడ అంధుల పాఠశాలలో వద్దిరాజు రవిచంద్ర ఆదేశానుసారం అంధ విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఎకరం స్థలంలో హరితహారం
వరంగల్: మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ సహకారంతో ఆదివారం మెగా హరితహారం చేపట్టినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. హసన్‌పర్తి చింతగట్టు క్యాంపు కార్యాలయ ఆవరణలోని ఎకరం స్థలంలో కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్పొరేటర్లు దివ్యా రాణి, రాజు నాయక్, జక్కుల రజిత వెంకటేశ్వర్లు, జన్ను షీభారాణి, సిరంగి సునీల్, ఇండ్ల నాగేశ్వర్రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు మధు ఆధ్వర్యంలో అతిథి మనోవికాస కేంద్రంలో కేక్ కట్ చేసి పిల్లలకు దుస్తులు అందజేశారు. భద్రకాళీ ఆలయ మాజీ ధర్మకర్త తొనుపునూరి వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడివెళ్లి సురేశ్, రామప్ప ఆలయ మాజీ ధర్మకర్త యలగందుల శ్రీధర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇరుకుళ్ల నరేశ్ పాల్గొన్నారు.