వరంగల్ చౌరస్తా, జూలై 17: ఇంటి కప్పు కూలి గాయాలపాలైన క్షతగాత్రులకు వైద్య సేవలందిం చడానికి నగదు వసూలు చేసిన ఎంజీఎం దవా ఖాన క్యాజువాలిటీ ఉద్యోగిపై 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్ జోషి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. 13వ డివిజన్ పరిధిలో బీ రామకృష్ణ, సరస్వతి ఇంటి కప్పు కూలడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వా రిని స్థానికులు అంబులెన్స్‌లో ఎంజీఎం దవాఖానకు తరలించారు. గాయాలను పరిశీలించిన వైద్యులు కుట్టు వేయాలని ఉద్యోగి అంజద్‌కు సూ చించారు.
సూదులు, దారం, తదితర సామగ్రికి రూ. 350 ఇస్తేనే కుట్లు వేస్తానని చెప్పాడు. తాము అంబులెన్స్‌లో వచ్చామని, డబ్బులు తీసుకురాలేదని చెప్పినా వినకపోవడంతో తోటి బాధితులు ఆర్థికసాయం అందజేశారు. క్షతగాత్రులను పరామ ర్శించడానికి ఎంజీఎం దవాఖానకు వచ్చిన కార్పొరేటర్ సురేశ్‌జోషి ఈ విషయంపై వైద్యాధికారితోపాటు సూపరింటెండెంట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశే ఖర్ను వివరణ కోరగా ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.