నల్లబెల్లి, జూలై 15 : వినూత్న పద్ధతుల్లో పత్తి సాగు చేయించి రైతులు అధిక దిగుబడి సాధించేలా కృషి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. అమెరికాలో పత్తి పంట సాగుపై అధ్యయనం చేసేందుకు ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పెద్ది టూర్‌కు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దిని మండలంలోని నారక్కపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా అమెరికాలో పత్తి పంట సాగుపై ఎమ్మెల్యే నాయకులకు వివరించారు. రైతులు పత్తి పంటపై అవసరానికి మించి రసాయనాలు పిచికారీ చేస్తూ దిగుబడిలో తీవ్రంగా నష్టపోతున్నా రన్నారు.
అమెరికాలో చేపడుతున్న పత్తి సాగుపై రైతుల కోసం సీఎం కేసీఆర్ స్టడీ టూర్ ఏర్పాటు చేశారన్నారు. త్వరలోనే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పత్తితో పాటు ఇతర పంటల సాగుపై ప్రత్యేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనుందన్నారు. పంటల సాగులో రైతులు మెళకువలు పాటించి అధిక దిగుబడితో ఆర్థిక పరిపుష్టి సాధించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నారక్కపేట గ్రామ అధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్, ఎంపీటీసీ ఓదెల లక్ష్మీ రవి, మాజీ సర్పంచ్ మోర్తాల రామారావు, మేరుగు రాజశేఖర్, నాయకుడు వక్కల చంద్రమౌళి పాల్గొన్నారు.
బాధితులకు ఆర్థిక సాయం
మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు మడతనపెల్లి రవీందర్ తల్లి సూరమ్మ, గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన పొన్నాల మల్లయ్య ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలను ఎమ్మెల్యే పెద్ది పరామర్శించారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీఆర్ఎస్ నాయకుడు చింత కొంరెల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా మూడు కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ చీకటి ప్రకాశ్, ఎంపీటీసీ పాలెపు రవీందర్రావు, మాజీ సర్పంచు రాంబాబు, నాయకులు సమ్మయ్యనాయక్, బైరుపాక సుదాకర్, కూస లింగారెడ్డి, వెంకటేశ్వర్లు, రాజిరెడ్డి, కుమార్, రమేష్, ఆదిరెడ్డి, మోహన్, శ్రీధర్, కనుకరాజు, రవీందర్, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన టీచర్లు
నర్సంపేట : పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయించినందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రిన్సిపాల్ జే రజిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దికి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను ఎమ్మెల్యే అభినందించారు.