నగరంలోని భద్రకాళి ఆలయంలో అమ్మవారు బుధవారం శాకంబరీగా దర్శనమిచ్చారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారిని పండ్లు, పూలు, కూరగాయలతో అలంకరించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్-రేవతి దంపతులు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శేషుభారతి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
నగరంలోని భద్రకాళి దేవాలయం అమ్మవారు బుధవారం ఆశాఢ పౌర్ణమి సందర్భంగా శాకాంబరీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలతో భద్రకాళి అమ్మ వారిని అలంకరించారు. ఉదయం 3 గంటల నుంచే ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చక బృందం అమ్మవారిని అలంకరించారు. 9గంటల నుంచి అనుమతించగా భక్తులు దర్శించు కున్నారు. ఆలయ ఈవో శేషుభారతి విస్తృత ఏర్పాటు చేశారు.
దర్శించుకున్న ప్రముఖులు
ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్‌భాస్కర్, రేవతి దంపతులు శాకాంబరీ అలంకరణలో ఉన్న భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్ణాహుతిలో పాల్గొని పూజలు చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దంపతులు, ఉత్తర విశాఖ పట్టణం ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్ కారం హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత అమ్మవారిని దర్శించుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు క్యూ లైన్లో సేవలు అందించారు. వేల సంఖ్యలో వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాగా, గురుపౌర్ణమి సందర్భంగా భద్రకాళీ ఆలయ సమీపంలోని సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు.