జనగామ చౌరస్తా, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పాలిసెట్ 2022-23 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎంపీసీ స్ట్రీమ్ విభాగంలో 74.24 శాతం ఉత్తీర్ణత, ఎంబైపీసీ విభాగంలో 74.08 శాతం ఉత్తీర్ణతను జిల్లా సాధించింది. ఎంపీసీ స్ట్రీమ్ విభాగంలో పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మాచర్ల గణేశ్ రాష్ట్ర స్థాయిలో 49వ ర్యాంకు సాధించాడు. జనగామలోని శ్రీనగర్ కాలనీకి చెందిన దొనికెల మహిత్ శ్రీకాంత్ 230వ ర్యాంకు, 2వ వార్డులోని ప్రెస్టన్ స్కూల్ మిషన్ కాంపౌండ్ ఏరియాకు చెందిన వంగరి దత్తాత్రేయ 782వ ర్యాంకు సాధించాడు. ఎంపీసీ స్ట్రీమ్ విభాగంలో జిల్లా స్థాయి ర్యాంకులో వీరు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఎంబైపీసీ విభాగంలో జఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన పసునూరి కావ్య రాష్ట్ర స్థాయిలో 477వ ర్యాంకు, బచ్చన్నపేట మండలానికి చెందిన రాగీరు అజయ్ 553 ర్యాంకు, పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మాచర్ల గణేష్ 593 ర్యాంకు సాధించాడు. ఎంబైపీసీ విభాగంలో జిల్లా స్థాయి ర్యాంకులో ఈ ముగ్గురు విద్యార్థులు ప్రథ మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మాచర్ల గణేష్ ఒక్కడే ఎంపీసీ స్ట్రీమ్‌లో రాష్ట్ర స్థాయి 49వ ర్యాంకు, ఎంబైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి 593 ర్యాంకు సాధించాడు.
గణేశ్‌కు 49వ ర్యాంకు
పాలకుర్తి రూరల్ : పాలిసెట్ ఫలితాల్లో మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన విద్యార్థి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 49వ ర్యాంక్ సాధించాడు. గూడూరుకు చెందిన మాచర్ల సరస్వతి-సదానందం కుమారుడు గణేశ్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. పాలిసెట్‌లో 120 మార్కులకుగానూ 115 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే 49 ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన గణేశ్ పాలిసెట్‌లో ప్రతిభ చూపడంతో స్థానిక సర్పంచ్ మంద కొమురయ్య, మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, ఎస్ఎంసీ చైర్మన్ నక్క సంజీవ, హెచ్ఎం ఈ మంజుల, ఉపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్, దేవగిరి సూర్య ప్రకాశ్ తది తరులు అభినం
చారు.