జిల్లాలో ఆరు రోజులుగా కురుస్తున్న వర్షం బుధవారం కాస్త గెరువిచ్చినా వరద ప్రభావం తగ్గలేదు. కొన్ని చోట్ల ముసురు పడుతుండగా, మరికొన్ని చోట్ల వస్తూ పోతూ ఉంది. పై నుంచి వరద వస్తుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. మొత్తం 97 చెరువులకు 33 అలుగు దుంకుతున్నాయి. జలపాతాల వద్దకు ప్రజలు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా బుధవారం సగటు వర్షపాతం 23.3 మి.మీ నమోదు కాగా, అత్యధికంగా కొత్తగూడ మండలంలో 54.8 మి.మీ వర్షం కురిసింది.
జిల్లాలో కొన్ని మండలాల్లో నిరంతరాయంగా వర్షం పడుతూనే ఉండగా, మరికొన్ని మండలాల్లో గెరువి చ్చింది. మరికొన్ని మండలాల్లో కాస్త విరామం ఇవ్వ డం, కాసేపు ముసురు పడింది. వాన కాస్త గెరివిచ్చినా వరద ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. వాగులు ఉధృ తంగా ప్రవహిస్తుండడంతో అన్ని చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీ వనం స్తంభించింది. పలు మండల కేంద్రాల నుంచి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడు బా వుల, బీమునిపాద, పాండవుల, వంకమడుగు జలపా తాలు ఉగ్ర రూపం దాల్చడంతో పర్యాటకులు వెళ్లకుం డా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గంగా రం మం డలంలో కోమట్లగూడెం వద్ద రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో నర్సిగూడెం, చింత గూడెం, జంగాలపల్లి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొత్తగూడ మండలం కొత్తపల్లి సమీపంలో ఉన్న మూడు వాగులు పొంగడంతో కొత్తగూడ- న ర్సంపేట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 14 గ్రామపంచాయతీలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
గూడురు మండలంలో పాకాల, వట్టి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బయ్యారం మండ లంలో మసివాగు, పందిపంపుల వాగు, అలిగేరు వాగు, పాకాల ఏరు పొంగి పొర్లుతోంది. నామాలపా డు వద్ద జిన్నెలవాగు రోడ్డుపై నుంచి వరద ఉదృతి తగ్గ డంతో ఇల్లందు-బయ్యారం మధ్య రాకపోకలు ప్రారం భమయ్యాయి. మొట్ల తిమ్మారం వద్ద ఉడుముల వాగు నీరు రోడ్లుపైకి రావడంతో మొట్ల తిమ్మాపురానికి రాక పోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. గార్ల మండలంలో గార్ల పెద్దచెరువు అలుగు పోస్తోంది. పాకాల ఏటివాగు వరదతో ఐదు రోజులుగా గార్ల-బయ్యారం, గార్ల- డో ర్నకల్ మధ్య ఉపకాల్వ రోడ్డుపై నుంచి పొంగడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. డోర్నకల్ శివారు ము న్నేరువాగు, ముల్కలపల్లి శివారు వద్ద ఆకేరువాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మండలంలో మొత్తం 97 చెరువులకు 33 చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. చిన్నగూడురు మండలం ఆకేరువాగు, జిన్నెల వాగులు పొంగి పొర్లుతున్నాయి. చిన్నగూడూరు, ఉగ్గంపల్లి చెరు వులు మత్తళ్ల పోస్తున్నాయి. నర్సింహులపేట మండలం లో ఆకేరు, పాలేరువాగులు ఉగ్రరూపం దాల్చాయి. బంధంచెరువు, పెద్దనాగారం బతుకమ్మ చెరువులు మత్తడి పోస్తున్నాయి. దంతాలపల్లి మండలంలో పా లేరు వాగు పొంగింది. కుమ్మరికుంట్ల, ఈనకుంట, గున్నెపల్లి, పెద్దముప్పారం, దాట్ల, రేపోని చెరువులు అలుగు దుంకుతున్నాయి. నెల్లికుదురు మండలంలో వావిలాల, బ్రాహ్మణకొత్తపల్లి చెరువులు మత్తళ్లు పోస్తు న్నాయి. ఆలేరు వద్ద కాజ్వే పై నుంచి వరద వెళ్తున్న ప్పటికీ రాకపోకలు సజావుగా సాగడంతో మహబూబా బాద్-తొర్రూరు మధ్య వాహనదారులకు ఇబ్బందులు తప్పాయి. జిల్లా కేంద్రంలో మున్నేరు వాగు వరద ఉధృతి కొనసాగుతునే ఉంది. నిజాం చెరువు మత్తడి పోస్తోంది. కంబాలపల్లి చెరువు, గుండ్లకుంట చెరు వులు అలుగు దుంకుతున్నాయి.
జిల్లాలో సగటు వర్షపాతం 23.3 మి.మీ
గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 23.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కొత్తగూడలో 54.8, బయ్యారం-19.6, గార్ల-15.8, డోర్నకల్-10.8, కురవి-16.6, మహబూబాబాద్-21.4, గూడూరు-39.8, కేసముద్రం-29.2, నెల్లికుదురు-22.6, న ర్సింహులపేట-13.6, మరిపెడ-13.4, తొ ర్రూరు-22.6, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.