మహబూబాబాద్, జూలై13:జిల్లాలో వరదలతో ముప్పు ఉన్న ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం వాట్లిల్లకుండా చూడాలని కలెక్టర్ కే శశాంక ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని శాఖల జిల్లా, మండలస్థా యి అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మూడు, నా లుగు రోజుల్లో భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా చూడాలన్నారు. వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా పరిష్కరించేం దుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి మండల స్థా యి అధికారి తమ హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలని చెప్పారు. వి ద్యుత్ తీగలు తెగి పశువులు మృతి చెందకుండా అధికారులు అత్యంత జాగ్రత్తలతో విధులు నిర్వర్తించాలన్నారు. కింది స్థా యి విద్యుత్ సిబ్బంది ప్రతి జీపీలో ఉండి ప్రమాదాలు చో టుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇనుప స్తంభాలున్న చోట విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా చూడాలన్నారు. తడి చేతులతో వాటికి ముట్టుకోకుండా ప్రజ లకు అవగాహన కల్పించాలన్నారు. సాధ్యమైనంత వరకు గ్రామాల నుంచి ప్రయాణాలు మానుకునేలా చూడాలని చెప్పారు. కల్వర్టులు, లోలెవల్ బ్రిడ్జిలు వద్ద సమస్య లే కుండా చూడాలన్నారు. వదర ఉన్న మార్గాల ద్వారా కా కుండా ఇతర ప్రాంతాల ద్వారా ప్రయాణాలు సాగేలా జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. టూరిస్ట్ ప్రాంతాల్లో గేట్ ఏర్పాటు చేసిన తర్వాతే పర్యాటకులను అనుమతించాలన్నారు. శిథి లావస్థలో ఉన్న అంగన్వాడీలు, పాఠశాలల్లో పిల్లలను కూర్చో బెట్టకుండా చూడాలని తెలిపారు. ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్ డేవిడ్, ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈ పసంద్‌కు మార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, ఆర్అండ్బీ ఈఈ తానేశ్వర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సుధాకర్, డీహెచ్ఎస్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వరుస వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కే శశాంక ఆదేశించారు. బు ధవారం ఆయన వైద్యాధికారులు, ఎంపీడీవో, అధికారులతో సీజనల్ వ్యాధులపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ, మలేరియా, టైఫాయిడ్, తదితర వైరల్ వ్యాధులు సోకకుండా చర్యలు చేపట్టాలన్నా రు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడేగా పాటించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. సబ్సెంటర్లలో మందులతోపాటు అత్యవసరమైన ప్లూయిడ్స్‌ను సైతం ఉం చాలని సూచించారు. వారానికోసారి గ్రామంలోని ఆశ కార్య కర్త, ఎంపీహెచ్ సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయాలన్నారు. ఇంటి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. హాస్టల్, పాఠశాలల్లో వంట వండే సమయంలో, డైనింగ్ ప్రాంతంలో శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. చికెన్ సెంటర్, ఇతర పదార్థా లు వచ్చే ప్రాంతాల్లో అపరిశుభ్రత లేకుండా వ్యాపారులు చూసుకోవా లన్నారు. కాన్ఫరెన్స్‌లో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ అభి లాషాఅభినవ్, జిల్లా వైద్యాధికారి హరీశ్‌రాజ్, డీపీవో సాయి బాబా, డిప్యూటీ డీఎంహెచ్‌వో అంబరీష, డీఎల్పీవోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక అన్నారు. బుధ వారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్‌తో కలిసి ఆర్టీసీ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బస్‌స్టాండ్ ప్రాంగణం లోకి ప్రైవేట్ వాహనాలు రాకుండా చూడాలన్నారు. మహ బూబాబాద్, తొర్రూరు సెక్టార్లలోని ఆరు మార్గాల్లో ప్రైవేట్ వాహనాల్లో తుఫాన్, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికు లను తరలిస్తే చర్యలు తప్పవన్నారు. ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్ఎం కృపాకర్‌రెడ్డి, మహబూబాబాద్ డీఎం కల్పన, తొర్రూరు డీఎం రమేశ్, డీటీవో కంచి వేణు, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రమేశ్‌రాథోడ్ పాల్గొన్నారు.