చిన్నగూడూరు, జూలై13: అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎం సహాయనిధి వరంలాంటిదని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. సీఎంఆర్ ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా నిలిచారని పేర్కొన్నారు. చిన్నగూడూరు మండల కేం ద్రం శివారు రామచంద్రుండాకు చెందిన బానోత్ శంక ర్కు రూ.32వేలు, మరిపెడ మండలానికి చెందిన అజ్మీ రా హుస్సేన్‌కు రూ.35వేలు, దంతాలపెల్లి మండలానికి చెందిన శ్రీనుకు రూ.60వేలు, కురవి మండలానికి చెందిన కళావతికి రూ.32500, జగదీశ్‌కు రూ.60వేలు, ఉమకు రూ.35వేలు, భద్రమ్మకు రూ.22వేలు, దోర్నకల్ మండలానికి చెందిన స్వాతికి రూ.30వేలు,అమ్కికి రూ. 25వేలు, లక్ష్మికి రూ.50వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. బుధవారం మండ లంలోని ఉగ్గంపల్లిలో రెడ్యానాయక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఇచ్చిన హమీలన్నీ అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచారన్నారు. అనంతరం కేసముద్రం మార్కెట్ మాజీ డైరెక్టర్ చెన్నయ్య నూతనంగా కొనుగోలు చేసిన షిఫ్ట్కారును రెడ్యానాయక్ ప్రా రంభించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా నాయకులు ఆయూబ్‌పాషా, సర్పంచ్ల పోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కోఆప్షన్ సబ్యులు మోసిన్బేగ్, నాయకులు శ్రీరాములు, లబ్ధిదారులు ఉన్నారు,