హసన్పర్తి, జూలై 9: అక్రమంగా తరలిస్తున్న ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని హసన్పర్తి ఎస్సై రవికిరణ్, టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం.. అనంతసాగర్ క్రాస్ వద ్దశనివారం సాయంత్రం 5.45 గంటల సమయంలో పెట్రోలింగ్ చేస్తుండగా రాంగోపాల్ కోళ్లఫాంలో రేషన్ బియ్యం అమ్ముతున్నారని సమాచారం వచ్చింది. ఈ మేరకు ఎస్సై రవికిరణ్, టాస్క్ఫోర్స్ పోలీసులు సోదాలు చేసి ఐదు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాటి విలువ రూ.13 వేలు ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని యజమాన్ని కోళ్లఫాంలో నిల్వచేస్తున్నట్లు తెలిపారు. హనుమకొండకు చెందిన కోళ్లఫాం యజమాని వెనెపల్లి రామారావు, ఎల్లాపూర్కు చెందిన ఎండీ అక్బర్పాషా(రోషన్), జయగిరికి చెందిన దండుగుల శ్రీనుపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేసినట్లు ఎస్సై రవికిరణ్, టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.