వరంగల్ చౌరస్తా, జూలై 8 : కాళోజీ ఆరో గ్య విశ్వవిద్యాలయం ఎదుట నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిన ఎంఎన్ఆర్, టీఆర్ఆర్, మహావీర్ వైద్యకళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఉద్యోగులను విధులకు హాజరు కా కుండా అడ్డుకున్నారు. వీసీ వెంటనే స్పందిం చి విద్యార్థులకు న్యాయం చేయాలని నినాదా లు చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మూడు కళాశాల అనుమతులు రద్దు చేసి నెలలు గడిచినా విద్యార్థులను ఇతర కళాశాలల్లోకి అనుమతించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశా రు. కళాశాలలను సందర్శించకుండా మౌలిక వసతులు సరిగాలేవనే సాకుతో ఇప్పుడు కళాశాలల అ నుమతులు రద్దు చేయడం ఎంతవ రకు సమంజసమో తెలుపాలన్నారు. ఈ విషయంపై మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకొని ఇబ్బందులు తొలగించాలని కోరారు. కాగా, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇతర కళాశాలల్లో విద్యార్థులను అనుమతించాలని చెప్పినప్పటికీ, అం దుకు సంబంధించిన అనుమతులు, విధివిధానాలను వెల్లడించలేదన్నారు. దీనిపై శనివారం ఉన్నతాధికారులతో వీసీ కరుణాకర్‌రెడ్డి సమావేశం కానున్నారని తెలిపారు. నిబంధనలను అనుసరించి విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని, వారి భవిష్యత్‌కు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.