పర్వతగిరి/నర్సంపేట/సంగెం, జూలై 5: ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ అందించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షుడు దీకొండ నరసింహారావు, హెచ్ఎంలు హైమావతి, బీ రాములు, వెంకటేశ్వర్లు, భారతి, అశోక్, కుమార్‌స్వామి పాల్గొన్నారు. అలాగే, రోటరీ క్లబ్ సభ్యులు గోపనపెల్లి సర్కారు బడి విద్యార్థులకు నోట్‌బుక్స్ అందించారు. రోటరీ క్లబ్ బాధ్యులు, హెచ్ఎంలు పూర్ణచందర్రావు, లింగమూర్తి, ఎస్ఎంసీ చైర్పర్సన్ రజిత, ఉపాధ్యాయులు మేకిరి దామోదర్, ప్రణయ్‌కుమార్, శ్రీనివాస్, అబ్దుల్ గఫార్, కరుణాకర్, వాసవి, శ్వేత, పరీద్, కుమారస్వామి, శ్రీధర్, సదానందం పాల్గొన్నారు.
నర్సంపేటలోని రామాలయం ప్రాథమిక పాఠశాలలో శ్రీరామోజు శ్రీధర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు 250 నోట్‌బుక్స్, 60 పెన్నులు, 20 పెన్సిళ్లు, 30 పలకలు, స్లేట్ పెన్సిళ్లు పంపిణీ చేశారు. 14 వ వార్డు కౌన్సెలర్ ఎలకంటి విజయ్‌కుమార్, కౌన్సిలర్ బత్తిని రాజేందర్, పెండెం రామానంద్, హెచ్ఎం వర్దెల్లి సతీశ్‌కుమార్, అంగన్వాడీ టీచర్ నల్లా భారతి, ఉపాధ్యాయుడు రవీందర్, ఆయా సునీత, శ్రీరామోజు కుమారస్వామి, పైండ్ల పవన్, ఐలోని శివ, నెల్లుట్ల శివ, ఎన్ శ్రీను పాల్గొన్నారు. సంగెం మండలంలోని ఎల్గూర్‌రంగంపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు యాదగరి 6 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పోతుల ప్రభాకర్, హెచ్ఎం అంతం రాజు, ఎం రమేశ్ పాల్గొన్నారు.