హనుమకొండ, జూన్ 20: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన ఉద్యోగార్థులపై పెట్టిన కేసులను విరమించుకొని ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్రం ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘అగ్నివీరులకు బట్టలు ఉతకడం, కటింగ్, షేవింగ్ నేర్పి వారు బయటకు వచ్చినంక ఆ పనులు దొరికేటట్టు చూస్తామని కిషన్‌రెడ్డి అవమానిస్తే, వారిని బీజేపీ కార్యాలయాల వద్ద రక్షక భటులుగా పెట్టుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సైనికులను అవహేళన చేశారు’ అని మండిపడ్డారు. దేశాన్ని అల్లకల్లోలంగా, అగ్నిగుండంలా మార్చిన అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని తెగేసి చెప్పారు.
నిరుద్యోగుల జీవితాల తో కేంద్రం ఆటలాడుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమ వారం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. అగ్నిపథ్ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొన్న నిరుద్యోగులపై పెట్టిన కేసులను విరమించుకోవడంతోపాటు ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఆ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకంపై కేంద్రం ఒంటెత్తు పోకడలకు పో తోందన్నారు. అంతేకాక ఈ 24 నుంచి ప్రక్రియను ప్రారంభించి వచ్చే నెల 24న పరీక్షలు నిర్వహించి డిసెంబర్లో నియామకాలు చేపడుతామనడం నిరుద్యోగ యువతను కించపరిచినట్లేనన్నారు. సైనికులపై గౌరవాన్ని దిగజార్చేలా కేంద్రం కుట్రలు పన్నుతోందన్నారు.
అగ్ని వీరులకు బట్టలు ఉతకడం, కటింగ్, షే వింగ్ చేయడం నేర్పి, వారు బయటకు వచ్చినంక ఆ పనులు దొరికేటట్టు చేస్తామని కిషన్‌రెడ్డి అవమానిస్తే, బీజేపీ ప్రధాన కార్యదర్శి తమ పార్టీ కార్యాలయాల వద్ద రక్షక భటులుగా పెట్టుకుంటామని సైనికులను అవహేళన చేశారని మంత్రి మండిపడ్డారు. యువతను ఆర్మీకి దూరం చేసి ఆర్ఎస్ఎస్కు దగ్గర చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. మీ పిల్లలను అగ్ని వీరులుగా పంపే దమ్ముందా అని ప్రశ్నించారు. జరిగిన అల్లర్లపై బీజేపీ, కేంద్రం మాట్లాడలేదని, కనీసం చనిపోయిన, గాయపడ్డ వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించకపోవడం బాధాకరం అన్నారు. పోలీసుల కాల్పుల్లో మరణించిన ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువకుడు రాకేశ్ కుటుం బానికి సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి రూ. 25లక్షలు ప్రకటించడంతోపాటు అర్హతనుబట్టి ఉద్యోగం ఇస్తాననే అంశాన్ని చూసైనా ప్రధాని మోదీలో మార్పు రాకపోవ డం విచారకరమన్నారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇ స్తామని ఇవ్వలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నిరుద్యోగ శాతం 5.6 శాతం నుంచి 7.83కి పెరిగిందన్నారు. బీజేపీ మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ రాజ్యాధికారం పొందాలని చూస్తోందని, రా బోయే రోజుల్లో అది చెల్లదన్నారు. ఇప్పటికే గ్యాస్, పె ట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై అధి క భారం పడుతోందన్నారు. ఏ ఒక్క హామీనీ అమలు చేకుండా మూర్ఖంగా పాలిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతోందన్నారు. దేశ భద్రతకు మరింత మెరుగైన ఆలోచనలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. అగ్నిపథ్ అనాలోచిత నిర్ణయమన్నారు.
సైనికుల వల్లే రెండోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రప్రభుత్వం వారినే అవమాన, కించపరచడం లాంటి చర్యలు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చట్లాలు తేవడంతో రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టి 700 మంది అమరులైన తర్వాత దిగివచ్చిన మోదీ వారికి క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకొన్నాడన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో.. ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, పనిచేయడం చాతకాకపోతే దిగిపోవాలని మంత్రి ఎద్దేవా చేశారు.
నిరుద్యోగులు సమయనం పాటించాలి
నిరుద్యోగ యువత తొందరపడొద్దని, భవిష్యత్‌ను పాడుచేసుకోకుండా శాంతియుత పోరాటాలను ఎంచు కోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. కేంద్ర ప్రభు త్వ వైఖరిని కలిసికట్టుగా నిరసిద్దామని పేర్కొన్నారు. కేంద్రం సైతం నిరుద్యోగుల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. వాజ్‌పేయి, మొరార్జీదేశాయ్ లాంటి వాళ్లను అభిమానించామని, కానీ ఇంత మూర్ఖ ప్రధాన మంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు.
ఇజ్రాయెల్ దేశంతో మన దేశాన్ని పోల్చడం దురద్రుష్టకరం అన్నారు. గుజరాత్ సీఎంగా ఫెయిల్ అయిన మోదీ ఇపుడు ప్రధానిగా దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, మతిలేని నిర్ణయాలే దేశాన్ని అయోమయానికి గురిచేస్తున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సార య్య, బండా ప్రకాశ్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.