కాజీపేట, జూన్ 20: రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్ర యాణికుల భద్రతే లక్ష్యమని రైల్వే ఆర్పీఎఫ్ ఐజీ అరుల్ జోతి సూచించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో కాజీపేట రైల్వే జంక్షన్లో పోలీసులు సోమవారం కవాతు నిర్వహించా రు. వచ్చీపోయే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన వారి పూర్తి అడ్రస్‌లు తెలుసుకుని విచారించి వదలిపె ట్టారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని, ప్రజలు పోలీసులకు సహక రించాలని ఆనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రైల్వే ఆర్పీ ఎఫ్ ఐజీ అరుల్ జోతి మాట్లాడుతూ రైల్వే దేశంలోని సామాన్య ప్రజల ఆస్తని, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రైల్వే స్టేషన్‌కు వచ్చీపోయే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టాలని పోలీసులకు సూచించా రు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా అత డు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడవుతాడని అన్నారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, రైల్వే డీఎ స్పీ మల్లారెడ్డి, రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవరావు, సీఐ మహేందర్ రెడ్డి, జీఆర్పీ సీఐ రామ్మూర్తి, ఎస్సైలు అశోక్‌కుమార్, ప్రదీప్, వెంకటేశ్వర్లు, లా అండ్ ఆర్డర్, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు.