హసన్‌పర్తి, జూన్ 20: గ్రామాలు అభివృద్ధిలో పోటీపడి ప్రతి పల్లె ఆదర్శంగా తయారు కావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆకాంక్షించా రు. హసన్‌పర్తి మండలంలోని పెంబర్తి, గంటూర్ పల్లి, సీతంపేటలో రూ. కోటీ 10 లక్షలతో చేపట్టిన శ్మశాన వాటికలు, సీసీ రోడ్లను సోమవారం ఆయ న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ గ్రామాలు ఉ త్తమ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. వర్ధన్నపే ట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందుండాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రామంలో ని తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆ ర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేరు గా గ్రామపంచాయతీలకు నిధులను అందజేయ డం తోనే ప్రతి గ్రామం ఆకుపచ్చగా తయారైంద ని చెప్పారు.
రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని రక్షించేలా చూడాలన్నారు. పల్లెలను సిటీ వాతావరణం తలపించేలా తయారు చేస్తానన్నా రు. గంటూర్‌పల్లిలో బీసీ కమ్యూనిటీ భవనం కా వాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురా గా, స్పందించి బీసీ కమ్యూనిటీ, మహిళా సంఘా ల భవనాలకు నిధులను మంజూరు చేస్తానని హా మీ ఇచ్చారు. సర్పంచులు జోరుక పూల, పెద్ది తిరుపతమ్మ, జనగాం శరత్, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ కందు కూరి చంద్రమోహన్, సర్పంచుల ఫోరం అధ్యక్షు డు పెసరు శ్రీనివాస్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బండి రజినీకుమార్, పిట్టల కుమారస్వామి, ఎంపీడీవో రామకృష్ణ్ర, ఎంపీటీసీలు, మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత
నయీంనగర్: ఐనవోలు మండలం కొండప ర్తి గ్రామానికి చెందిన బోయినపల్లి వెంకటేశ్ తండ్రి సుధాకర్‌రావుకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 2 లక్షలు మంజూరయ్యాయి. దీనికి సంబంధిం చిన చెక్కును సోమవారం హనుమకొండ ప్ర శాంత్ నగర్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే రమేశ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరంలా మారిందని అన్నారు. కార్య క్రమంలో దర్గా సొసైటీ చైర్మన్ ఈకంటి వనంరె డ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సర్పంచ్ రాజమణీబెన్సన్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.