పెద్దవంగర, జూన్20 : దళితబంధు పథకం ప్రపంచ దేశాలకు ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గంలో 1500 దళిత కుటుంబాలకు యూనిట్లు పంపిణీ చేస్తామన్నారు. మొదటగా కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేశామన్నారు. దళితబంధు తరహాలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. దళితబందు పథకం కోసం ప్రతి సంవత్సరం రూ.25వేల కోట్లు కేటాయిస్తామన్నారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి పొందేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అందుకే కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి అనేక అవార్డులు ప్రదానం చేసిందన్నారు. వచ్చే నెల నుంచి 57 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ పింఛన్లు అందజేస్తామన్నారు. గ్రామాల్లో సొంత ఇల్లు జాగ ఉన్న కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నాడు ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారని, అదే తరహాలో నేడు సీఎం కేసీఆర్ నిరుపేదల పాలిట దేవుడయ్యారని అన్నా రు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఐలయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, జిల్లా, మండల రైతుబంధు సమితి సభ్యులు నెహ్రూనాయక్, సోమనర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు యాదగిరిరా వు, ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, సుధీర్‌కుమార్, వెంకన్న, జ్ఞానేశ్వరాచారి, ఉపేందర్‌రెడ్డి, లింగమూర్తి, వీరన్న, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.