నెక్కొండ, జూన్ 18: జిల్లాలో ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన పల్లెప్రగతి పనులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించారు. మల్టీపర్పస్ వర్కర్ల సేవలను కొనియాడుతూ వారిని ఘనంగా సన్మానించారు. అలాగే, అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా నెక్కొండ మండలం అలంకానిపేటలో నిర్వహించిన గ్రామసభలో జేడీఏ ఉషాదయాళ్ పాల్గొని మాట్లాడారు. పల్లెప్రగతి కార్యక్రమంలో అలంకానిపేట ఆదర్శంగా నిలువడం అభినందనీయమన్నారు. గ్రామంలోని ఏ వీధిని చూసినా పచ్చదనం, పరిశుభ్రతతో కనిపిస్తున్నదన్నారు. సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి గ్రామపెద్దలు, వార్డుసభ్యులను సమన్వయం చేస్తూ పనులు చేశారన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. గ్రామసభలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కర్పూరపు శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ మాదాసు అనంతలక్ష్మి, గ్రామ ప్రత్యేకాధికారి వినేకర్, కార్యదర్శి మధు పాల్గొన్నారు. అనంతరం అప్పల్రావుపేట జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన సమావేశంలో జేడీఏ మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్లెప్రగతి, బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో హెచ్ఎం బీ శ్రవణ్‌కుమార్, సర్పంచ్ వడ్డె రజితా సురేశ్, గ్రామ ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్, కార్యదర్శి నరేశ్ పాల్గొన్నారు.
మల్టీపర్పస్ వర్కర్ల సేవలు అభినందనీయం
గీసుగొండ: పల్లెప్రగతి కార్యక్రమంలో మల్టీపర్సస్ వర్కర్ల సేవలు అభినందనీయమని డీపీవో నాగపూరి స్వరూపారాణి అన్నారు. గంగదేవిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని మల్లీపర్పస్ వర్కర్లను సన్మానించారు. పల్లెప్రగతిలో గుర్తించిన సమస్యలకు జీపీ పాలకవర్గ సభ్యులు పరిష్కారం చూపారన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత నిరంతర ప్రక్రియ అని, దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందిన గంగదేవిపల్లి, మరియపురంతో మిగతా గ్రామాలు అభివృద్ధిలో పోటీ పడాలని ఆకాంక్షించారు. సభలో సర్పంచ్ గోనె మల్లారెడ్డి, ఏపీవో మోహన్‌రావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
‘పల్లెప్రగతి’ పనులపై చర్చలు..
దుగ్గొండి/వర్ధన్నపేట/చెన్నారావుపేట: దుగ్గొండి మండలంలోని చలపర్తి, రేఖంపల్లి, దుగ్గొండిలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, నర్సరీని పరిశీలించిన అనంతరం జీపీ రికార్డులను తనిఖీ చేశారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు నిరంతరం కొనసాగించాలని ఆమె అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. వానకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలన్నారు. వచ్చే హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్‌లు ఇమ్మడి యుగేంధర్, ముదరుకోల శారదాకృష్ణ, కార్యదర్శి సంతోష్‌కుమార్, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలంలో గ్రామసభలు నిర్వహించారు. 15 రోజులపాటు జరిగిన పల్లెప్రగతి పనులతోపాటు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సమగ్రంగా చర్చించారు. సర్పంచ్ల అధ్యక్షతన జరిగిన గ్రామసభల్లో జీపీ సిబ్బందిని సన్మానించారు. చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట, పుల్లాయబోడుతండాలో 15 రోజుల్లో జరిగిన అభివృద్ధి పనులపై గ్రామసభల్లో ప్రజలకు వివరించారు. పాపయ్యపేటలో సర్పంచ్ ఉప్పరి లక్ష్మి జీపీ సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ సమ్మునాయక్, గ్రామ ప్రత్యేక అధికారులు పుష్పలత, సత్యనారాయణ, కార్యదర్శులు శ్యామ్, శ్రవణ్‌కుమార్, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.

జీపీ సిబ్బందికి ప్రజాప్రతినిధుల సన్మానం
నర్సంపేటరూరల్/రాయపర్తి/పర్వతగిరి: నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో చివరిరోజు గ్రామసభలు నిర్వహించారు. ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్ పాల్గొని కార్యదర్శులు, కారోబార్లు, జీపీ సిబ్బందిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కమ్మపల్లి గ్రామసభలో జడ్పీటీసీ, ఎంపీడీవో, సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ జీపీ సిబ్బందిని సన్మానించారు. 15 రోజులపాటు జరిగిన కార్యక్రమాలపై చర్చించారు. పలు గ్రామాల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, కార్యదర్శుల పర్యవేక్షణలో 15 రోజులపాటు నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజు జీపీ ఉద్యోగులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సత్కరించారు. మండలకేంద్రంలో సర్పంచ్ గారె నర్సయ్య జీపీ కార్మికులను సన్మానించి నిత్యావసర వస్తువుల కిట్లు అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు లేతాకుల సుమతీ యాదవరెడ్డి, నలమాస సారయ్య, చిన్నాల తారాశ్రీ రాజబాబు, కర్ర సరిత రవీందర్‌రెడ్డి, కోదాటి దయాకర్‌రావు, కందికట్ల స్వామి, ఆలకుంట్ల రాజేందర్, చిలుముల్ల ఎల్లమ్మ యాకయ్య, గజవెల్లి అనంత ప్రసాద్, కుక్కల భాస్కర్, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, కుంచారపు హరినాథ్, భూక్యా వెంకట్రాంనాయక్, కునుసోత్ సరిత సజ్జన్‌నాయక్, లకావత్ సమ్మక్క-భాస్కర్‌నాయక్, సంకినేని ఉప్పలమ్మ, సూదుల దేవేందర్‌రావు, లావుడ్యా చిరంజీవి, పెండ్లి రజిని-సుధాకర్‌రెడ్డి, గుగులోత్ సుందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో సభలు నిర్వహించారు. చింతనెక్కొండలో సర్పంచ్ గటిక సుష్మా ఆధ్వర్యంలో జీపీ సిబ్బందిని సన్మానించారు. అనంతరం కార్యదర్శి సరితతో కలిసి మొక్కలు నాటారు. దౌలత్‌నగర్‌లో మహిళలకు ప్రోత్సాహకంగా రుణాలను అందించిన బ్యాంకు మేనేజర్ చెన్నయ్య, ప్రత్యేకాధికారి కృష్ణమూర్తిని సత్కరించారు. గోరుగుట్టతండాలో సర్పంచ్ బానోత్ వెంకన్న, సీసీ రవీందర్‌రాజు జీపీ సిబ్బందిని సన్మానించారు.
సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి
సంగెం: సమష్టి కృషితోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధిస్తాయని సంగెం ఎంపీపీ కందకట్ల కళావతి అన్నారు. సంగెంలోని పంచాయతీ కార్యాలయంలో ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో పని చేస్తేనే తగిన ఫలితం వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధి కోసం పల్లెప్రగతిని ప్రవేశపెట్టారన్నారు. అనంతరం జీపీ సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ మల్లేశం, ప్రత్యేకాధికారి ఏ రాజేశ్వర్‌రావు, సర్పంచ్ గుండేటి బాబు, ఉపసర్పంచ్ కక్కెర్ల శరత్‌బాబు, ఎంపీటీసీ మెట్టుపెల్లి మల్లయ్య, కార్యదర్శి రవీందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.