కరీమాబాద్/నర్సంపేట/ఖిలావరంగల్/రాయపర్తి, జూన్ 11: పిల్లలను అన్ని రకాల సౌకర్యాలు ఉన్న సర్కారు బడులకే పంపించాలని వరంగల్ 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ సూచించారు. డివిజన్లోని పలు అంగన్వాడీ సెంటర్లలో శనివారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లం పద్మ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో పల్లం రవి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. నర్సంపేటలోని అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నాయిని సునీత, తల్లులు ఆబోత్ కల్పన, పిట్టల రవళి, బొల్లోజు లావణ్య, కాసాని కృషిత, బొల్లంపెల్లి శారద, స్వప్న, అనిత, కొలిపాక రవళి, ఆయా సునీత పాల్గొన్నారు. వరంగల్ 38వ డివిజన్ పడమర కోటలోని అంగన్వాడీ కేంద్రంలో కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్యాదవ్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పడమరకోటలోని మున్నూరుకాపు వీధిలో పట్టణ ప్రగతిలో భాగంగా పర్యటించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ నరేందర్, స్వయంభూ శ్రీశంభులింగేశ్వరస్వామి ఆలయ చైర్మన్ గజ్జెల శ్యామ్, పీఏసీఎస్ డైరెక్టర్ తోటకూరి నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు తోటకూరి చేరాలు, సులగం వేణుగోపాల్, రావుల రాజేశ్, పోశాల సారంగపాణి, బొల్లం కార్తీక్, బండి శోభ, పోశాల అరుణ, గద్దల దయాకర్, బైరబోయిన మంజుల పాల్గొన్నారు. రాయపర్తి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల నమోదు కోరుతూ ఐసీడీఎస్ అధికారులు బడిబాట ర్యాలీలు తీశారు. పన్యానాయక్తండా సర్పంచ్ భూక్యా వెంకట్రాంనాయక్, వర్ధన్నపేట ఐసీడీఎస్ సూపర్వైజర్ సత్యవతి, పన్యానాయక్తండా కార్యదర్శి భూక్యా మహేందర్నాయక్ నేతృత్వంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భూక్యా క్రాంతి, అంగన్వాడీ టీచర్ భారతి, ఆయా రాజమ్మ పాల్గొన్నారు.